Latest Updates
-
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు!
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..
జుట్టు రాలడం, కురులు పలచబడటం అనేది వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ ఆయిల్స్, రసాయనాలతో కూడిన షాంపూలు వాడి విసిగిపోయారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన, సహజసిద్ధమైన పరిష్కారం ఉంది. అదే బయోటిన్ లడ్డూ. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి బయోటిన్ (విటమిన్ బి7) చాలా అవసరం. దీని కోసం మందులు మింగాల్సిన పనిలేదు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఈ బయోటిన్ లడ్డూలను తింటే చాలు.

బయోటిన్ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు
వేరుశెనగ గుళ్లు - అర కప్పు
అవిసె గింజలు- అర కప్పు
గుమ్మడి గింజలు- పావు కప్పు
పొద్దుతిరుగుడు గింజలు - పావు కప్పు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
బాదం, జీడిపప్పు - 1/3 కప్పు
వాల్ నట్స్, పిస్తా - పావు కప్పు
ఖర్జూరాలు - 2 కప్పులు
బయోటిన్ లడ్డూ తయారీ విధానం
-ముందుగా ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టి సన్నని మంటపై వేడి చేయండి. అందులో అర కప్పు వేరుశెనగ గుళ్లను వేసి, దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే కడాయిలో అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వేసి అవి చిటపటలాడే వరకు డ్రై రోస్ట్ చేయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత, వేరుశెనగ గుళ్లతో పాటు మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా పప్పులను అందులో వేయాలి. ఇవి కమ్మటి వాసన వచ్చే వరకు, లేత బంగారు రంగులోకి మారేంతవరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఈ లడ్డూలో మనం పంచదార లేదా బెల్లం లాంటివి ఏమీ వాడటం లేదు. దానికి బదులుగా ఐరన్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలను తీసుకుంటున్నాం. గింజలు తీసేసిన రెండు కప్పుల ఖర్జూరాలను మిక్సీలో వేసి, చాలా కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా పట్టుకోవాలి.
-ఇప్పుడు పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, ఈ ఖర్జూరం పేస్ట్ ను వేయించాలి. ఖర్జూరంలోని పచ్చిదనం పోయి, తేమ అంతా లాగేసి, ముద్దలా దగ్గరపడే వరకు ఉడికించాలి.
-ఖర్జూరం మిశ్రమం తయారైన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గింజల పొడిని, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే.. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజులో గుండ్రటి లడ్డూలుగా చుట్టుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన బయోటిన్ లడ్డూలు రెడీ.
-ఈ లడ్డూలను గాలి చొరబడనిగాజు సీసాలో లేదా డబ్బాలో నిల్వ చేసుకోండి. రోజూ 1 లేదా 2 లడ్డూలను తినడం అలవాటు చేసుకోండి. ఇందులో వాడిన గింజలు, డ్రై ఫ్రూట్స్ మీ శరీరానికి కావలసిన బయోటిన్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను సహజ పద్ధతిలో అందిస్తాయి. దీనివల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారడమే కాకుండా, చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications