స్ట్రాబెర్రీ అండ్ క్రీమ్ స్విస్ రోల్ రెసిపీ

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మార్కెట్ లో లభించే రెడీ మేడ్ స్విస్ రోల్స్ ని మీరీపాటికి ప్రయత్నించే ఉండుంటారు. వాటిని 2 లేదా మూడు పీసులు తినగానే ఇంక తినలేమనే భావన కలుగుతుంది. రెడీ మేడ్ గా లభించే స్విస్ రోల్స్ రుచి మన టేస్ట్ బడ్స్ ని సంతృప్తి పరచలేవని చెప్పుకోవాలి. అదృష్టవశాత్తు, ఈ డిష్ ని మనం ఇంటిలోనే ఎంతో రుచికరంగా తయారుచేసుకోవచ్చు. రుచికరమైన స్విస్ రోల్స్ ను స్ట్రాబెరి స్విస్ క్రీమ్ తో చేసుకునే అద్భుతమైన రెసిపీని మీకు ఈ రోజు పరిచయం చేస్తున్నాం. స్ట్రాబెరీ క్రీమ్ స్విస్ రోల్ ను తయారుచేసి మీ కుటుంబానికి అలాగే స్నేహితులకి వడ్డించి వారి పొగడ్తలను అందుకోండి.

Strawberry Swiss roll recipe
స్ట్రాబెరీ స్విస్ రోల్ రెసిపీ ! స్ట్రాబెరీ క్రీం స్విస్ రోల్స్ ను తయారుచేసే విధానం ! స్ట్రాబెరీ క్రీమ్ స్విస్ రోల్ రెసిపీ
స్ట్రాబెరీ స్విస్ రోల్ రెసిపీ ! స్ట్రాబెరీ క్రీం స్విస్ రోల్స్ ను తయారుచేసే విధానం ! స్ట్రాబెరీ క్రీమ్ స్విస్ రోల్ రెసిపీ
Prep Time
20 Mins
Cook Time
10M
Total Time
30 Mins

Recipe By: పూజా గుప్తా

Recipe Type: డెసెర్ట్

Serves: 3-4

Ingredients
 • మైదాపిండి - 1 కప్పు

  తెల్లసొనను, పచ్చసొనను విడదీయబడిన గుడ్లు - 3

  తగినంత ఉప్పు

  క్యాస్టర్ షుగర్ - 1 కప్పు

  కొన్ని చుక్కల వెనీలా ఎసెన్స్

  ఫిల్లింగ్ కోసం

  విప్ చేయబడిన కార్టాన్ క్రీమ్ 1 1/2 కప్పు

  తరిగిన స్ట్రాబెరీ - 8-10

  అద్దడానికి కాస్తంత ఐసింగ్ షుగర్

Red Rice Kanda Poha
How to Prepare
 • ఒవేన్ ను 200°C/400°F/Gas 6 లో ప్రీహీట్ చేయండి.

  33cm x 23cm/13 x 9 ల స్విస్ రోల్ టిన్ పై గ్రీజ్ ప్రూఫ్ పేపర్ ను పరవండి

  ఎగ్ వైట్స్ ని శుభ్రమైన పొడి పాత్రలోకి తీసుకుని తగినంత ఉప్పును జోడించండి.

  పొడిగా కనిపించేవరకు ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.

  ఇప్పుడు, చక్కెరను జోడించి మిశ్రమాన్ని బాగా కలపండి.

  చివరగా, గుడ్డులోని పచ్చని సొనని వేసి మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండండి.

  మైదా పిండిని జల్లెడ పట్టి ఒక మెటల్ స్పూన్ తో తయారుచేయబడిన గుడ్డు మిశ్రమానికి జోడించండి.

  వెనీలా ఎసెన్స్ ను కూడా జోడించండి.

  ముందుగా సిద్ధం చేసుకున్న టిన్ లోకి ఈ పదార్థాన్ని ట్రాన్సర్ చేయండి. సమంగా అప్లై చేయండి.

  పదినిమిషాల పాటు బేక్ చేయండి.

  అయితే, వర్క్ సర్ఫేస్ లో కాస్త క్యాస్టర్ షుగర్ ని అద్దిన గ్రీస్ ప్రూఫ్ పేపర్ ని అమర్చడం మరచిపోకండి.

  కేక్ బేక్ అవగానే, పేపర్ మీదకు టర్న్ చేయండి. లైనింగ్ పేపర్ ని తొలగించి అంచులను పదునైన కత్తితో ట్రిమ్ చేయండి.

  కాగితం లోపల ఉండగానే పొడవైన అంచునుంచి కేక్ ను పైకి తిప్పుకోండి. కేక్ ని చల్లారనివ్వండి.

  చల్లారిన 20 నిమిషాల తరువాత మృదువుగా అన్రోల్ చేసి గ్రీజ్ ప్రూఫ్ పేపర్ ని తొలగించండి.

  ఇప్పుడు కేక్ పై విప్డ్ క్రీమ్ ను పరచి దాని పైన తరిగిన స్ట్రాబెరీలను అమర్చండి.

  స్విస్ రోల్ లా వచ్చేలాగా మళ్ళీ పైకి రోల్ చేయండి

  ఐసింగ్ షుగర్ ని అద్ది సర్వ్ చేయండి.

Instructions
 • జామ్, విప్డ్ క్రీమ్ తో పాటు జామ్, లెమన్ కర్డ్ , చాకొలేట్ స్ప్రెడ్ వంటి ప్రత్యామ్నాయ ఫిల్లింగ్స్ ను కూడా మీరు వాడవచ్చు', 28cm x 18cm/11 x 7 వంటి చిన్నపాటి టిన్ ను వాడేటట్లయితే కేక్ తయారీలో 50 గ్రాముల సెల్ఫ్ రైసింగ్ పౌడర్ని, 2 గుడ్లను, 50గ్రాముల క్యాస్టర్ షుగర్ ను వాడితే సరిపోతుంది.
Nutritional Information
 • సర్వింగ్ సైజ్ - 1 స్లైస్
 • కేలరీలు - 198
 • ఫ్యాట్ - 12 గ్రాములు
 • ప్రోటీన్ - 4 గ్రాములు
 • కార్బోహైడ్రేట్లు - 18 గ్రాములు
 • షుగర్ - 12 గ్రాములు
 • డైటరీ ఫైబర్ - 14 గ్రాములు
[ 3.5 of 5 - 77 Users]
Subscribe Newsletter