Latest Updates
-
దోశ, రైస్, చపాతీలోకి కిర్రాక్ అనిపించే చికెన్ చాప్స్..ఈ ఆదివారం స్పెషల్ గా మారిపోతుంది -
టిఫిన్స్ లోకి ఈ వెల్లుల్లి చట్నీ చేస్తే..రోజూ తినేదాని కన్నా ఎక్కువ తినేస్తారు! -
ఆదివాసీ ఫిష్ ఫ్రై..గారెల్లా కరకరలాడుతూ భలే రుచిగా -
అయ్యయ్యో పాపం తాత..75 ఏళ్ల వ్యక్తితో 30 ఏళ్ల యువతి పెళ్లి వ్యవహారంలో భారీ ట్విస్ట్..వీడియో చూడండి -
చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే శరవణ భవన్ స్టైల్ క్యాలీఫ్లవర్ కుర్మా..ఈజీగా చేసుకోండిలా.. -
అమృతం రుచిని తలపించేలా వంకాయ పచ్చడి..ఇలా చేస్తే 2 నెలలు నిల్వ -
ఆడవారిలో రక్తం బాగా పెరగాలంటే..తరచూ వీటిని తినండి -
నోట్లో పెట్టుకుంటే జారిపోయే పచ్చికొబ్బరి హల్వా..చక్కెర లేకుండానే 10 నిమిషాల్లోనే చేసుకోండిలా.. -
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే..
ఎండాకాలంలో తప్పక తాగాల్సిన డ్రింక్ ఇదే..ఒరిస్సా ఫేమస్ 'టంకా టొరానీ',ఎలా చేయాలంటే..
ఒడిషా పేరు వినగానే మనందరికీ గుర్తుకొచ్చేది పూరీ జగన్నాథ ఆలయం. పూరీలోని జగన్నాథ ఆలయం రాముడి కాలం నుంచే ఉంది. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పూరీ జగన్నాథ ఆలయంలో మహా ప్రసాదంగా 'టంకా టొరానీ' విక్రయిస్తుంటారు. టంకా టొరానీ అనేది ఒడిశాలోని ఒక సాంప్రదాయ పానీయం. దీనిని మజ్జిగ, పెరుగు, నీరు, అల్లం, ఉప్పు, పంచదార, నిమ్మరసం, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి,పుదీనా ఆకులతో తయారు చేస్తారు. ఇది వేసవిలో తాగడానికి చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. దీనిని మీరు కూడా మీ ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. టంకా టొరానీ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
టంకా టొరానీ తయారీకి కావలసిన పదార్థాలు
మజ్జిగ - 1 లీటరు
జీలకర్ర - 1 టీస్పూన్
కొత్తిమీర - 1/4 కప్పు
కరివేపాకు - 1 రెమ్మ
పెరుగు - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 2
నీరు - 1/2 కప్పు
అల్లం - 1 అంగుళం ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
చక్కెర- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
పుదీనా ఆకులు - కొద్దిగా

టంకా టొరానీ తయారీ విధానం
-ముందుగా అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకులను సన్నగా తరగాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో మజ్జిగ, పెరుగు, నీరు, అల్లం, ఉప్పు, పంచదార, నిమ్మరసం, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా ఆకులను వేసి బాగా కలపాలి.
-ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో 30 నిమిషాలు చల్లబరచాలి.
-చల్లబడిన టంకా టొరానీని గ్లాసుల్లో పోసి సర్వ్ చేసుకోవడమే.
పాకిస్తాన్ కి,హోలీ పండుగకి సంబంధం ఏంటీ? రంగుల పండుగ వెనుక 5000 ఏళ్ల చరిత్ర
టంకా టొరానీ ప్రయోజనాలు ఇవే
టంకా టొరానీలో పెరుగు, మజ్జిగ ఉండటం వల్ల ఇది కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి 12 లకు మంచి మూలం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో,రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.టంకా టొరానీలో ఉపయోగించే పదార్థాలను బట్టి దాని పోషక విలువలు మారుతూ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
