Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పాకిస్తాన్ కి,హోలీ పండుగకి సంబంధం ఏంటీ? రంగుల పండుగ వెనుక 5000 ఏళ్ల చరిత్ర
హోలీ పండుగ భారతదేశంలో వసంతఋతువు రాకను సూచిస్తూ జరుపుకునే రంగుల పండుగ. ఇది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు వస్తుంది. ఈ ఏడాది మార్చి 14న హోలీ పండుగను జరుపుకుంటున్నాం. హోలీ పండుగను దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారు. హోలీకి ముందు రోజు రాత్రి హోలికా దహనం చేస్తారు. మరుసటి రోజు ఉదయం ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటారు.
అసలు హోలీ మొదటిసారిగా ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలుసా? హోలీ పండుగప్పుడు రంగులు చల్లుకోవడమే తెలిసిన నేటి యువతకు దాని చరిత్ర గురించి పెద్దగా తెలియకపోవచ్చు. వాస్తవానికి హోలీ పండుగ పుట్టింది పాకిస్తాన్ లోనే అని చెబుతారు. దేశ విభజన వల్ల చరిత్ర విభజించబడదు లేదా తుడిచివేయబడదు కదా. పాకిస్తాన్ లోని ప్రహ్లాదపురి ఆలయం చెబుతున్నది ఇదే. కానీ విభజన కారణంగా ఈ ఆలయం నేడు పూర్తిగా వదిలివేయబడింది. హోలీ ఈ ఆలయానికి అనుసంధానించబడి ఉంది..అందుకే హోలీ వచ్చినప్పుడల్లా ఈ ఆలయం చర్చనీయాంశంగా మారుతుంది.

పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందువులు హోలీ నాడు పూజలు చేసి ఇక్కడ హోలీ జరుపుకోవాలని కోరుకుంటారు. కానీ భద్రతా కారణాల వల్ల అది సాధ్యపడట్లేదు. అందువల్ల ఈ సంవత్సరం కూడా పాక్ లోని హిందూ సంస్థ పాకిస్తాన్ ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది.
పాకిస్తాన్‌లో హోలీ జరుపుకుంటారా?
పాకిస్తాన్‌లో కూడా హోలీ జరుపుకుంటారు. పాకిస్తాన్‌లో హిందువుల జనాభా దాదాపు 2 శాతం. అలాగే సింధ్ ప్రావిన్స్‌లో ఎక్కువ మంది హిందువులు నివసిస్తున్నారు. హిందువుల జనాభా ఎక్కువగా ఉన్న పాకిస్తాన్ లో హోలీ జరుపుకోవడానికి అనుమతి ఉంది. 2016 సంవత్సరం తర్వాత పాకిస్తాన్ హిందువులు కూడా హోలీ రోజున సెలవు పొందుతారు.
ప్రహ్లాదపురి ఆలయానికి హోలీ సంబంధం
హోలీకి సంబంధించిన పురాణాలలో భక్తుడైన ప్రహ్లాదుడి ప్రస్తావన, హోలికా దహనం గురించి ఉంది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతడు విష్ణువును ద్వేషించేవాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువును పరమ భక్తునిగా ఆరాధించేవాడు. ప్రహ్లాదుని భక్తిని సహించలేని హిరణ్యకశిపుడు అతన్ని అనేక రకాలుగా హింసించాడు. చివరకు హోలిక అనే తన సోదరి సహాయంతో ప్రహ్లాదుడిని అగ్నిలో దహనం చేయాలని ప్రయత్నించాడు. హోలికకు అగ్నిలో దహనం కాకుండా ఉండే వరం ఉంది. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి వెళ్ళింది. కానీ విష్ణువు నరసింహస్వామి అవతారంలో వచ్చి తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడతారు, హోలిక మాత్రం మంటల్లో కాలిపోయింది. ఈ సంఘటన హోలికా దహనంగా ప్రసిద్ధి చెందింది. చెడుపై మంచి సాధించిన విజయానికి,భక్తికి ప్రతీకగా హోలీ జరుపుకుంటారు.
పాకిస్తాన్ లోని ప్రహ్లాదపురి ఆలయం నరసింహ స్వామికి అంకితం చేయబడింది. నరసింహస్వామి, ప్రహ్లాదుడి కథ హోలీతో ముడిపడి ఉంది. అందువల్ల ఇది మొదటి ప్రహ్లాదుని ఏకైక ఆలయం అని నమ్ముతారు. అందువల్ల హోలీ వేడుక ఈ ఆలయం నుండే ప్రారంభమైందని చెబుతారు.
హిరణ్యకశ్యపుడు ముల్తాన్ ను పాలించిన రాజు
ఈ ఆలయం పాకిస్తాన్ లోని ముల్తాన్ లో ఉంది. పురాణాల ప్రకారం ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశ్యపుడు ముల్తాన్ ను పాలించిన పురాతన రాజు. ఈ చరిత్ర తెలుసుకున్న తర్వాత హోలీ వేడుకలు ఈ ఆలయం నుండే ప్రారంభమై ఉండాలని స్పష్టమవుతుంది.
5 వేల సంవత్సరాల పురాతన ఆలయం
ప్రహ్లాదపురి ఆలయం 5 వేల సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయాన్ని ప్రహ్లాదుడు నరసింహ భగవానుడి కోసం నిర్మించాడని కూడా చెబుతారు.
బాబ్రీ కూల్చివేత తర్వాత ఈ ఆలయంపై దాడి
ఈ ఆలయం 1992 సంవత్సరం వరకు మంచి స్థితిలో ఉందని చెబుతారు..కానీ భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు ఈ ఆలయంపై కూడా దాడి జరిగింది. నేడు ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని హిందూ సంస్థలు తరచుగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆలయానికి రూ.50 లక్షలు కేటాయించినట్లు సమాచారం.



Click it and Unblock the Notifications