Latest Updates
-
ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా? -
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా.. -
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి.. -
అరేయ్ మామా.. మీ బెస్ట్ ఫ్రెండ్ కి పంపించడానికి అదిరిపోయే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు.. -
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు -
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే!
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే!
వీకెండ్ వచ్చిందంటే చాలు ఇళ్లలో చికెన్ ఘుమఘుమలు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే, ప్రతిసారీ ఒకేలా చికెన్ 65, చిల్లీ చికెన్, లేదా రోటీన్ చికెన్ ఫ్రైలు తిని మీకు బోర్ కొట్టిందా? ఈ వీకెండ్ లో చికెన్‌తో ఏదైనా కొత్తగా, కాస్త భిన్నమైన వంటకం ప్రయత్నించాలని ఆలోచిస్తున్నారా? అయితే తిరువనంతపురం స్పెషల్ చికెన్ ఫ్రై ట్రై చేయండి. కేరళ వంటకాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తిరువనంతపురం స్పెషల్ చికెన్ ఫ్రై మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తిరువనంతపురం చికెన్ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు
మ్యారినేషన్ కోసం
చికెన్ - అర కేజీ (శుభ్రం చేసింది)
ధనియాల పొడి - 1 టీస్పూన్
కారం పొడి - అర టీస్పూన్
పసుపు పొడి - పావు టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
నిమ్మకాయ - సగం
ఉప్పు - మీ రుచికి తగినంత
వేయించడానికి
కొబ్బరి నూనె - 4 టేబుల్ స్పూన్లు
చిన్న ఉల్లిపాయలు - ఒక గుప్పెడు
పెద్ద ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - ఒక కట్ట
తిరువనంతపురం చికెన్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా చికెన్ ను పసుపు, ఉప్పు వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ తీసుకుని అందులో ధనియాల పొడి, కారం, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, మిరప తురుము, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం నిమ్మకాయ రసం పిండి మసాలా అంతా ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఇలా కలిపిన చికెన్ ను మూతపెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టి నానబెట్టాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. అందులో 3-4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె పోయండి. నూనె వేడెక్కాక ముందుగా నానబెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుతూ ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి సుమారు 10 నిమిషాల పాటు చికెన్‌ను వేయించి, ఆ ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో మిగిలిన నూనెలో సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత, అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
-చివరగా, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను ఈ మసాలాలో వేసి బాగా కలపాలి. మంటను సిమ్ లో పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే తిరువనంతపురం చికెన్ ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications