Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
బెల్లంతో కమ్మటి అటుకుల పాయసం..దీన్ని మించిది ఉండదేమో..ఎలా చేసుకోవాలంటే
బెల్లంతో తయారుచేసే అటుకుల పాయం ఎప్పుడైనా తిన్నారా? ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లంతో చేసే అటుకుల పాయసం టేస్టీగా ఉంటమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక రకాలుగా మేలు చేస్తుంది. సాధారణంగా పండుగలు,ప్రత్యేక సందర్భాలలో దీనిని తయారుచేస్తుంటారు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే దీనిని తయారుచేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. తక్కువ సమయంలోనే టేస్టీ బెల్లం అటుకుల పాయసం మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
అటుకుల పాయం తయారీకి కావలసిన పదార్థాలు
-నెయ్యి
-డ్రై ఫ్రూట్స్
-పాలు
-అటుకులు
-బెల్లం తురుము
-పెసరపప్పు
-యాలకల పొడి
-పచ్చి కర్పూరం
-ఉప్పు

అటుకుల పాయం తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
-నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో పావు కప్పు డ్రై ఫ్రూట్స్ ముక్కలు(బాదం,జీడిపప్పు,ఎండుద్రాక్ష వంటి మీకు నచ్చినవి) వేసి వేయించి పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద గిన్నెలో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేయాలి. పెసరపప్పు కొద్దిగా వేగాక ఇందులో 1 కప్పు అటుకులు వేసి దోరగా వేయించుకొని పక్కనపెట్టుకోండి.
ఆంధ్రా స్పెషల్ చింతచిగురు గుత్తివంకాయ కూర..వాసనకే ముత్తాతలు కూడా దిగొస్తారు..ఎలా చేయాలో చూడండి
-తర్వాత స్టవ్ మీద గిన్నెలో 3 కప్పుల పాలు, 1కప్ప నీళ్లు పోసి మీగడ కట్టుకుండా పాలను గరిటతో కలుపుతూ పొంగు రానివ్వాలి.
-ఇదే సమయంలో స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో 1 కప్పు బెల్లం తురుము,పావు కప్పు నీళ్లు వేసి చిన్న మంట మీదనే బెల్లాన్ని కలుపుతూ కరిగించాక గిన్నెను స్టవ్ మీద నుంచి దించేసి పాకాన్ని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు పాలు పొంగువస్తున్న సమయంలో ఇందులో వేయించిన అటుకులు,పెసరపప్పు వేసి కలిపి మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ పెసరపప్పు పూర్తిగా ఉడికేదాకా ఉడించాక స్టవ్ ఆఫ్ గిన్నెను దించేసి ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్, అర టీస్పూన్ యాలకల పొడి,చిటికెడు పచ్చి కర్పూరం, చిటికెడు ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలపాలి.
-తర్వాత అందులో కరిగించిన బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసి వేసుకొని కలపాలి. అంతే హెల్దీ అటుకుల పాయసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
