Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కోడిగుడ్లు లేకుండానే సూపర్ టేస్టీ ఎగ్ కర్రీ..అసలు దీని టేస్ట్ ముందు మటన్ కూడా పనికిరాదు..ఎలా చేసుకోవాలంటే
నాన్ వెజ్ తినని చాలామంది గుడ్డు తినడం మనం చూస్తుంటాం. ఇంటవికి చుట్టాలు వచ్చినప్పుడో లేకుంటే ఎగ్ కూడా తినని వాళ్ల కోసం ఏం చేయాలా అని ఆలోచించాల్సి వస్తుంది. అటువంటి సమయంలో ఎగ్ లేని ఎగ్ కర్రీ చేయడం ఉత్తమం. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్గంగా తింటారు. దీని తయారీకి కూడా ఎక్కువ పమయం పట్టదు. కోడిగుడ్లు లేకుండా ఎగ్ కర్రీ ఎలా చేయాలబ్బా అని ఆలోచిస్తున్నారా? ఎగ్ లేకుండా దాన్ని మించిన రుచితో ఎగ్ కర్రీ తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయరీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పన్నీర్
-బంగాళదుంప
-మిరపకాయ
-ఉప్పు
-మొక్కజొన్న పిండి
-శెనగపిండి
-పసుపు
-ఆయిల్
-టమాటో
-కొత్తిమీర
-కారం
-జీలకర్ర పొడి
-గరం మసాలా
-ధనియాల పొడి
-జీలకర్ర
-అల్లంవెల్లుల్లి పేస్ట్
తయారీ విధానం
-ముందుగా 250 గ్రాముల పన్నీర్ తీసుకొని దాన్ని గ్రేటర్ తో సన్నగా తురుముకోవాలి.
-తర్వాత మెత్తగా ఉడికించిన 2 బంగాళదుంపలను కూడా తురుముకోవాలి.
-పన్నీర్,బంగాళదుంప తురుమును ఒక ప్లేట్ లో వేసి ఇందుో పావు టీస్పూన్ ఉప్పు, వేసి పలుకులుగా లేకుండా పన్నీర్ బంగాళదుంప తురుమును చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి.
-బాగా పిసికిన మిశ్రమాన్ని ముప్పావు వంతను పిండిని ఒక సైడు, పావు వంతు పిండిని సపరేట్ గా పక్కన ఉంచుకోండి.
-తర్వాత సపరేట్ గా ఉంచిన పావు వంతు మిశ్రమంలో కొద్దిగా పసుపు వేసి బాగా కలపాక గట్గా వత్తుకుంటూ చిన్న చిన్న ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత గుడ్డుపై ఉండే వైట్ పార్ట్ చేయడం కోసం..కలిపి పక్కన ఉంచి పన్నీర్,బంగాళదుంప ముప్పావు వంతు మిశ్రమంలో పావు కప్పు మొక్కజొన్న పిండి వేసి అస్సలు పలుకులు లేకుండా చేత్తో బాగా మెత్తగా కలుపుకోవాలి.
-తర్వాత దీనిని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకుంటా గారెలా వత్తుకొని అందులో ముందుగా రెడీ చేసా పక్కన ఉంచిన ఉండ పెట్టి ఎగ్ లా మడుచుకోవాలి.
-తర్వాత ప్లేట్ లో 1 స్పూన్ మెక్కజొన్న పిండి వేసి వత్తుకున్న ఎగ్స్ షేపులో వత్తుకున్న అన్నింటినీ పిండిలో ముంచి తీసి దానిమీద ఎక్స్ ట్రా పిండిని దులిపేయండి.
-తర్వాత స్టవ్ మీద కడాయిలో డాప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేడి చేసి అందులో రెడీ చేసుకున్న ఎగ్ షేపులో ఉన్నవాటిని వేసి మంచికలర్ వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత గ్రేవీ కోసం మిక్సీ గిన్నెలో రెండు ఉల్లిపాయల పెద్ద ముక్కలు వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే మిక్సీలో 3 ఉడికించిన టమాటోలను తొక్క తీసి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ టమాటో ప్యూరీని ఓ గిన్నెలోకి తీసి పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 4-5 స్పూన్ల ఆయిల్ వేసి కాగిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్గ్ వేసి మంచి రంగు వచ్చి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసి అందులోని నీటిశాతం అంతా ఇగిరిపోయేవరకు కలుపుతూ ఉడికించాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, పావు స్పూన్ పసుపు 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి మసాలాలన్ని వేగి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించాలి.
-ఇప్పుడు అందులోనే 1 స్పూన్ శెనగపిండి వేసి 2 నిమిషాలు కలుపుతూ ఉడికించాక గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. మూతపెట్టి తక్కువవ మంట మీద కూరలోని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించాలి.
-ఇప్పుడు అందులో 4 పచ్చిమర్చి పెద్ద ముక్కలు, కొంచెం కరివేపాకు, వేయించి పెట్టుకున్న పన్నీర్ గుడ్లు, కొత్తిమీర తరుగు వేసి గ్రేవీని వాటిమీద గరిటతో పోస్తూ 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత ప్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే టేస్టీ వెజ్ ఎగ్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





