Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
స్పెషల్ మాంగో ఖీర్..గిన్నెల కొద్దీ తాగుతూనే ఉంటారు..ఎలా చేయాలంటే
ప్రస్తుతం ఎక్కడ చూసినా మామిడిపండ్లు కనబడుతున్నాయి. సమ్మర్ వస్తే ప్రతి ఇంట్లోనూ మామిడి పండ్ల సువాసన గుబాళిస్తుంది. మామిడికాయలతో పచ్చిపులుసు, ఊరగాయలు, జ్యూస్ లు, ఐస్‌క్రీమ్‌లు, స్వీట్స్ ఇలా ఎన్నో రకాలు తయారుచేస్తారు. వాటిలో మామిడి ఖీర్ ఒకటి. మామిడి ఖీర్ అనేది మామిడిపండ్ల గుజ్జు, పాలు, సగ్గుబియ్యం పంచదార, యాలకులు, డ్రై ఫ్రూట్స్‌తో తయారుచేసే ఒక రుచికరమైన తీపి వంటకం. దీనిని మామిడికాయ పాయసం అని కూడా పిలుస్తారు. మాంగో ఖీర్ ను తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మాంగో ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మామిడికాయలు
-సేమియా
-జీడిపప్పు
-ఎండుద్రాక్ష
-నెయ్యి
-పాలు
-సగ్గుబియ్యం
-చక్కెర
-యాలకల పొడి
-కండెన్స్డ్ మిల్క్

మాంగో ఖీర్ తయారీ విధానం
-ముందుగా రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని అరగంటసేపు నానబెట్టాలి
-తర్వాత రెండు తియ్యని పీచులేన బంగినపళ్లి మామిడాకాయలను చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ గిన్నెలో వేసి ప్యూరీలా చేసి పక్కనపెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేశాక అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేసి కలర్ మారేంతవరకు తక్కువమంట మీద కలుపుతూ వేయించి తర్వాత వాటిని గిన్నెలోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఉన్న పాన్ లో ఉన్న నెయ్యిలోనే 1 కప్పు సేమియా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ తక్కువమంట మీద వేయించున్నాక దానిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
సూపర్ హెల్దీ రాగి తోప..రక్తం పట్టడానికి, ఉక్కులాంటి ఎముకల కోసం ఇదే సరైనది..ఎలా చేసుకోవాలంటే
-తర్వాత స్టవ్ మీద పాన్ లోనే 4 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు, అరగంటసేపు నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించాలి.
-పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో వేయించిన సేమియా వేసి బాగా కలుపుకొని 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి.
-తర్వాత అందులో 1 కప్పు చక్కెర వేసి కలుపుకొని మరో 2 నిమిషాలు మరగనివ్వాలి.
-తర్వాత అందులో అరటీస్పూన్ యాలకల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-చల్లారిన పాయసంలో రెండు టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్, మిక్సీలో చేసుకున్న మాంగో ప్యూరీ, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications