Latest Updates
-
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
స్వీట్ షాపు స్టైల్ చెకోడీలు..ఇంట్లోనే ఇలా చేసుకుంటే గుళ్లగా,కరకరలాడుతూ భలే రుచి
చెకోడీలు పేరు వినగానే చిన్ననాటి జ్ఞాపకాలుపండుగ సందడి, అమ్మమ్మ చేతి రుచులు గుర్తుకొస్తాయి. ఇవి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన, సాంప్రదాయక స్నాక్. సాయంత్రం వేళ టీతో పాటు స్నాక్ గా తినడానికీ, పండుగలప్పుడు బంధుమిత్రులకు వడ్డించడానికీ, ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లడానికీ చెకోడీలు బెస్ట్ ఆప్షన్. కరకరలాడుతూ, రుచిగా ఉండే ఈ చెకోడీలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. చెకోడీలు తయారు చేయడం కొంచెం సమయం తీసుకునే పని అయినా, ప్రక్రియ చాలా సులభం. స్వీట్ షాపు స్టైల్ లో ఇంట్లోనే టేస్టీగా చెకోడీలను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
చెకోడీల తయారీకి కావాల్సిన పదార్థాలు
-మైదాపిండి
-నువ్వులు
-వాము
-ఆయిల్
-నెయ్యి
-పసుపు
-నీరు
-ఉప్పు

తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో పావు లీటరు నీళ్లు పోయండి. నీళ్లలోనే ఓ టేబుల్ స్పూన్ డాల్డా లేదా నెయ్యి, అర చెంచా పసుపు, 1 టీస్పూన్ నువ్వులు, 1 టీస్పూన్ వాము, కూడా వేసి తెర్ల కాగనివ్వాలి.
-నీళ్లు బాగా తెర్లకాగుతున్నప్పుడు అందులో పావు కేజీ మైదాపిండి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి లేదా ప్లేట్ లోకి తీసుకొని వేడిమీద ఉన్నప్పుడే మిశ్రమాన్ని తడిగుడ్డతో లేదా చేతికి కొద్దిగా నూనె రాసుకుని వత్తుకోవాలి. పిండి ఎంత మెత్తగా కలిపితే చెకోడీలు అంత చక్కగా, పగుళ్లు లేకుండా వస్తాయి.
-కలిపి పెట్టుకున్న పిండిని పెద్ద పెద్ద బాల్స్ గా చేసి పెట్టుకోండి.
-ఇప్పుడు కారప్పూస గిద్దలో పెద్ద బొక్కలున్న మౌల్డ్ పెట్టుకోండి. కారప్పూస గిద్దలో కొంచెం నెయ్యి రాయండి.
-తర్వాత కారప్పూస గిద్దలో పిండి బాల్స్ వేసి ఓ బల్ల మీద పొడవుగా పెన్సిల్ మందంలో దారాల మాదిరిగా ఒత్తుకోండి
-ఇప్పుడు వాటిని వేలికి చుట్టుకొని రింగులో చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఒక మందపాటి కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియంకి తగ్గించండి. తయారు చేసి పెట్టుకున్న చెకోడీలను ఒక్కొక్కటిగా లేదా కొన్నింటిని జాగ్రత్తగా నూనెలో వేయండి. కడాయి నిండా వేయకండి, కొంచెం ఖాళీ ఉంచండి.
-చెకోడీలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారి, కరకరలాడే వరకు వేయించండి. మధ్యమధ్యలో తిప్పుతూ ఉండండి, అప్పుడే అన్ని వైపులా సమానంగా వేగుతాయి.
-వేగిన తర్వాత నూనె నుండి తీసి, టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి మార్చండి. ఇది అదనపు నూనెను పీల్చుకుంటుంది. అన్ని చెకోడీలు వేయించడం పూర్తయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మరింత కరకరలాడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications