Latest Updates
-
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.!
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి!
మన తెలుగు వారికి ఊరగాయలంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఆవకాయ, నిమ్మకాయ, లేదా టమాటా పచ్చడి కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. అయితే ఇవన్నీ మనం రెగ్యులర్ గా తినేవే. కానీ మీరు ఎప్పుడైనా వెరైటీగా బంగాళదుంప ఊరగాయ రుచి చూశారా?
వినడానికి కాస్త కొత్తగా అనిపించినా, దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అనేక రకాల మసాలా దినుసుల సువాసనలతో, కాస్త తీపి, పులుపు, కారం కలగలిసిన ఈ పచ్చడి ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు. బంగాళదుంప ఊరగాయ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

బంగాళదుంప ఊరగాయ తయారీకి కావాల్సిన పదార్థాలు
బంగాళదుంపలు: 700 గ్రాములు చిన్నవి
ఆవ నూనె: ముప్పావు కప్పు
నల్ల ఆవాలు: 2 టేబుల్ స్పూన్లు
పసుపు ఆవాలు: 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు: 6 నుండి 7
ధనియాలు: 1 టేబుల్ స్పూన్
సోంపు: 1 టేబుల్ స్పూన్
తరిగిన పచ్చి మిరపకాయలు: 1 టేబుల్ స్పూన్
తరిగిన వెల్లుల్లి: 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
కారం: 1 టీస్పూన్
వాము: 1 టీస్పూన్
ఆమ్ చూర్ పొడి: 1 టీస్పూన్
మెంతులు: 1 టీస్పూన్
పసుపు: అర టీస్పూన్
ఉప్పు: మీ రుచికి తగినంత
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
బంగాళదుంప ఊరగాయ తయారీ విధానం
-ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్ లో వేసి ఉడికించాలి. బంగాళదుంపలు మరీ మెత్తగా అవ్వకూడదు. చిన్న దుంపలకైతే 2 విజిల్స్, పెద్దవారైతే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. అవి చల్లారాక తొక్క తీసి, మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో నల్ల ఆవాలు, పసుపు ఆవాలు, ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, సోంపు వేసి సన్నని మంటపై వేయించండి. అవి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఈ మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
-మరో పాన్ తీసుకుని అందులో ఆవ నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి వేయించండి. ఇప్పుడు పసుపు, కారం, వాము, మెంతులు, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి బాగా కలపండి. మసాలాలు నూనెలో మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, సరిపడా ఉప్పు వేసి ముక్కలన్నింటికీ మసాలా పట్టేలా నిదానంగా కలపండి.
-చివరగా స్టవ్ ఆపేసి, అందులో నిమ్మరసం, ఆమ్ చూర్ పొడి వేసి మరోసారి బాగా కలిపితే గుమగుమలాడే బంగాళదుంప ఊరగాయ రెడీ.
ఈ ఊరగాయను చపాతీ, పూరీ, పరోటా లేదా పప్పు అన్నంలో నంజుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. గాలి చొరబడని సీసాలో నిల్వ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రెండు, మూడు రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
