Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
మైసూర్ స్పెషల్ పల్లీ కొబ్బరి చట్నీ..ఈ చట్నీ చేస్తే ఇడ్లీ, దోశలు ఎన్ని తింటారో మీకే తెలీదు!
బ్రేక్ ఫాస్ట్ లో వేడివేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోశలు వేసుకోవడం మనందరి ఇళ్లలో సాధారణంగా జరిగే పనే. ఆ అల్పాహారం ఎంత రుచిగా ఉన్నా, అందులోకి సరైన చట్నీ లేకపోతే ఆ మజానే రాదు. అయితే, ఎప్పుడూ ఇంట్లో రొటీన్‌గా చేసుకునే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, లేదా టమాటా చట్నీలు తిని తిని మీకు విసుగొచ్చేసిందా? అయితే ఓసారి మైసూర్ స్పెషల్ పల్లీ కొబ్బరి చట్నీ ట్రై చేయాల్సిందే.
సాధారణంగా మనం చేసుకునే చట్నీల కంటే ఈ మైసూరు శైలి చట్నీ రుచిలో చాలా భిన్నంగా ఉంటుంది. కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో ఈ చట్నీ చాలా ఫేమస్.

మైసూర్ స్పెషల్ పల్లీ కొబ్బరి చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
వేరుశెనగలు (పల్లీలు) - 1/2 కప్పు
మినపపప్పు - 1 టేబుల్ స్పూన్
వంట నూనె - 2 టేబుల్ స్పూన్లు
కాశ్మీరీ ఎండుమిర్చి - 5 (చట్నీకి మంచి రంగు వస్తుంది)
బెల్లం పొడి - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 3
చింతపండు గుజ్జు లేదా రసం - 1/2 టేబుల్ స్పూన్
మిరియాలు - 4
పచ్చి కొబ్బరి తురుము - 3/4 కప్పు
కారం - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - మీ రుచికి తగినంత
మైసూర్ స్పెషల్ పల్లీ కొబ్బరి చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి.
-నూనె కాస్త వేడెక్కాక అందులో పల్లీలు (వేరుశెనగలు), మినపపప్పు వేసి మీడియం మంటపై దోరగా వేయించండి. తర్వాత కశ్మీరీ ఎండుమిర్చిని వేసి మరో రెండు నిమిషాల పాటు మాడిపోకుండా వేయించాలి. తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, కొద్దిగా చింతపండు రసం, బెల్లం పొడి వేసి మరో నిమిషం పాటు సన్నని మంటపై ఉడికించండి. బెల్లం, చింతపండు కలయిక వల్ల చట్నీకి ఆ అద్భుతమైన మైసూరు స్పెషల్ రుచి వస్తుంది.
-చివరిగా అందులో పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుతూ మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన మిశ్రమాన్ని వేసి, సుమారు ఒక కప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-అంతే... ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే మైసూర్ చట్నీ రెడీ.
-ఈ చట్నీని మీరు నేరుగా అలాగే వేడివేడి ఇడ్లీ లేదా దోశతో ఆస్వాదించవచ్చు. మీకు ఘాటుగా, మరింత రుచిగా కావాలనుకుంటే.. కొద్దిగా నూనెలో ఆవాలు, మినపపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కమ్మని తాలింపు పెట్టుకుంటే దీని రుచి అమాంతం పెరిగిపోతుంది. ఈ చట్నీని ఫ్రిజ్ లో పెడితే రెండు రోజుల పాటు తాజాగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications