Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
శరీరానికి చలువ, ఎముకలకు బలం..పాతకాలపు పద్ధతిలో రాగి ముద్ద ఇలా చేయండి
దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రాయలసీమ, కర్ణాటక ప్రాంతాలలో రాగి సంగటి లేదా రాగి ముద్ద అనేది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, అది అక్కడి సంస్కృతిలో ఒక భాగం. పూర్వం పొలం పనులకు వెళ్లే రైతులు, శారీరక శ్రమ చేసేవారు ఉదయాన్నే రాగి సంగటి తిని వెళ్లేవారు. ఇది వారికి రోజంతా కావాల్సిన శక్తిని ఇవ్వడమే కాకుండా, శరీరానికి చలువ చేస్తుంది.
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి వల్ల కలిగే అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా రాగి సంగటిని సూపర్ ఫుడ్ గా భావిస్తున్నారు. చాలామంది రాగి సంగటి చేయడానికి భయపడతారు, ఎందుకంటే పిండి ఉండలు కడుతుందని లేదా మెత్తగా రాదని ఆందోళన చెందుతారు. కానీ సరైన కొలతలతో మొదటిసారే అద్భుతమైన సంగటిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-రాగి పిండి
-నెయ్యి
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అర కప్పు బియ్యం వేసి(రెగ్యులర్ గా తినే బియ్యం లేదా రేషన్ బియ్యం)నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీటిని వంపేయండి.
-కడిగిన బియ్యంలో నీళ్లు పోసి కనీసం అరగంట సేపు నానబెట్టాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 4 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాక అందులో నానబెట్టిన బియ్యం వేసి ఉడికించాలి. దీనికి 7-8 నిమిషాల వరకు సమయం పడుతుంది.
-రైస్ ఉడికిన తర్వాత అందులో 1 కప్పు రాగి పిండి వేసి,ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేయండి. రాగి పిండి వేసిన తర్వాత గరిటతో అస్సలు కలపవద్దు. అలాగే మూతపెట్టి 5-6 నిమిషాలు మీడియం మంట మీద ఉడకనివ్వాలి.
-తర్వాత మూత తీసి గరిటతో బాగా కలుపుకోవాలి.కావాలనుకుంటే 1 టీస్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోండి. బాగా కలుపుకున్నాక మూత పెట్టి తక్కువ మంట మీద మరో 5 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత మూత తీసి చూస్తే రాగి సంగటి రెడీ. స్టవ్ ఆపేసి గిన్నెను పక్కకు తీసుకోండి.
-ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి లేదా నీటిని అప్లై చేసుకొని రాగి సంగటిని చేతుల్లోకి తీసుకొని ముద్దల్లా చేసుకోండి.అంతే పర్ఫెక్ట్ రాగి సంగటి రెడీ.
-వెజిటేరియన్స్ అయితే పప్పుచారు,సాంబార్, రసం వంటి కాంబినేషన్స్ తో తీసుకోవచ్చు..నాన్ వెజిటేరియన్స్ అయితే నాటుకోడి కర్రీ, కోడిగుడ్డు పులుసు, మటన్ కర్రీ వంటి వాటితో తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications