Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
బిర్యానీని మించిన రుచి.. ఘుమఘుమలాడే మునగకాయ అన్నం..ఎలా చేసుకోవాలంటే
మునగకాయ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి సాంబారు, పులుసు లేదా మహా అయితే కాస్త సమయం ఉంటే చేసే వేపుడు. చాలామంది ఇక్కడితోనే మునగకాయ ప్రయోగాలు ఆపేస్తారు. కానీ ఎప్పుడూ అవేనా? కాస్త కొత్తగా, రుచిలో బిర్యానీకి సైతం సవాలు విసిరేలా ఉండే అద్భుతమైన మునగకాయ అన్నం ఎప్పుడైనా రుచి చూశారా? సరైన పద్ధతిలో, సరైన కొలతలతో చేస్తే ఈ మునగకాయ అన్నం రుచి మాటల్లో చెప్పలేనిది.
కేవలం రుచే కాదు, మునగకాయల్లో ఉండే పోషకాలన్నీ ఈ అన్నం ద్వారా మన శరీరానికి అందుతాయి. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అందిస్తుంది. మీ వంటగదిలో సువాసనలు వెదజల్లే ఈ ప్రత్యేకమైన మునగకాయ అన్నం మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
-బియ్యం - 1 కప్పు (సోనా మసూరి లేదా మీకు నచ్చినవి)
-ఉడికించిన మునగకాయ గుజ్జు - 2 కప్పులు
-పెద్ద ఉల్లిపాయ - 1
-పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
-ఎండు మిరపకాయలు - 5
-పసుపు - పావు టీస్పూన్
-ధనియాల పొడి - అర టీస్పూన్
-జీలకర్ర పొడి - అర టీస్పూన్
-ఆవాలు - పావు టీస్పూన్
-మినపప్పు - అర టీస్పూన్
-జీడిపప్పు - 10-12
-నూనె - తగినంత
-ఉప్పు - రుచికి సరిపడా
-కొత్తిమీర - కొద్దిగా
-కరివేపాకు - రెండు రెమ్మలు

తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసి పక్కన
పెట్టుకోవాలి.
-మునగకాయలను కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా ఉడికించి, చల్లారాక చెంచాతో లోపలి గుజ్జును జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఒక మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, ఎండు మిరపకాయలు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆవాలు వేగిన తర్వాత మినపప్పు, జీడిపప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు దోరగా వేయించాలి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి..ఉల్లిపాయలు గులాబీ రంగులోకి మారేంతవరకు వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించాలి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మునగకాయ గుజ్జు, రుబ్బిన కొబ్బరి-మిరప ముద్దను వేసి బాగా కలపాలి. నూనె పైకి తేలేంత వరకు రెండు మూడు నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు అందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి, మసాలా అంతా బియ్యానికి పట్టేలా ఒక నిమిషం పాటు కలపాలి.
-ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల చొప్పున నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. కుక్కర్ లో అయితే మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి. గిన్నెలో అయితే మూత పెట్టి, అన్నం ఉడికి పొడిపొడిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
-అన్నం ఉడికిన తర్వాత చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి నెమ్మదిగా ఒకసారి కలిపి, ఐదు నిమిషాలు అలా వదిలేయాలి. అంతే నోరూరించే, ఘుమఘుమలాడే పోషకాల మునగకాయ అన్నం రెడీ.
-దీనిని వేడివేడిగా పెరుగు పచ్చడి లేదా అప్పడాలతో తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
