Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
తెలంగాణ సాంప్రదాయ వంటకం.. రుచికరమైన,పోషకాల పప్పు బియ్యం ఎలా చేసుకోవాలంటే..
తెలంగాణ వంటకాలు అనగానే మనకు గుర్తొచ్చేవి ఘాటైన మసాలాలు, పులుపు, కారంతో కూడిన రుచులు. కానీ ఈ ఘాటుదనానికి పూర్తి భిన్నంగా మనసును, శరీరాన్ని ప్రశాంతపరిచే ఒక అద్భుతమైన వంటకం ఉంది. అదే పప్పు బియ్యం. దీనిని కొన్ని ప్రాంతాలలో పప్పు అన్నం లేదా వట్టి పప్పు అన్నం అని కూడా అంటారు.
ఇది కేవలం ఒక వంటకం కాదు, తెలంగాణ ప్రజల జీవనశైలిలో, సంస్కృతిలో భాగమైపోయిన ఒక ఆప్యాయతానుభూతి. బిజీగా ఉండే రోజుల్లో త్వరగా వండుకోవాలన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తేలికగా అరిగే ఆహారం కావాలన్నా, పిల్లలకు పోషకాహారం అందించాలన్నా అందరి మొదటి ఎంపిక పప్పు బియ్యమే. పప్పు బియ్యం రెసిపి ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
లవంగాలు-5
ఏలకలు-2
బిర్యానీ ఆకులు-2
ఆయిల్-2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క- 1 ఇంచు
ఉల్లిపాయ తరుగు- 1 కప్పు
పచ్చిమిరపకాయలు-3
కరివేపాకు- 1 రెమ్మ
కొత్తిమీర తరుగు- 1కప్పు
పుదీనా- 1కప్పు
బియ్యం- 1 కప్పు
కందిపప్పు-పావు కప్పు
నీళ్లు- 2 కప్పులు
ఉప్పు-రుచికి తగినంత
పసుపు-పావు టీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్- 1 టేబుల్ స్పూన్
బంగాళదుంప ముక్కలు-1 కప్పు
టమాటోలు- 2 కప్పు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం,పావు కప్పు పచ్చిశెనగ పప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఆ గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి గంట సేపు నాననివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో మాములు మసాలా దినుసులు(యాలకలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం)వేసి వేయించాలి.
-ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు వేసి వేపాలి. ఉల్లిపాయలు మెత్తబడినప్పుడు అందులో క్యూబ్స్ రూపంలో కట్ చేసిన బంగాళదుంప ముక్కలు,అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటోల ముక్కలు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు కొద్ది కొద్దిగా వేసి టమాటోలను పూర్తిగా మెత్తబడనివ్వాలి.
-తర్వాత అందులో గంట సేపు నానబెట్టిన బియ్యం పచ్చిశెనగపప్పు వేసి బియ్యంలోని చెమ్మ ఆరేదాకా నిదానంగా వేయించండి.
-తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి ఎక్కువగానే కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అన్నం వండుకున్నట్లు వండుకోవడమే. తర్వాత మూత తీస్తే పప్పు బియ్యం రెసిపి రెడీ.
-దీనిని టమాటో రోటీ పచ్చడితో తింటే స్వర్గమే. దీనికి నంజుకోవడానికి కొత్త ఆవకాయ బద్ద, మామిడికాయ ముక్కల పచ్చడి లేదా నిమ్మకాయ ఊరగాయ అద్భుతంగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications