Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
తాతముత్తాతల బలమైన ఆహారం..షుగర్ కు చెక్,గుండెకు రక్షణ..జొన్న బువ్వ ఎలా చేసుకోవాలంటే..
జొన్న బువ్వ అనేది భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో తరతరాలుగా వాడుకలో ఉన్న ఒక సంప్రదాయక ఆహారం. మన పూర్వీకులు అందించిన ఆరోగ్య రహస్యం. దీనిని జొన్న సంగటి,జొన్న అన్నం అని కూడా పిలుస్తారు. ఇది కేవలం రుచికరమైనదే కాక, అత్యంత పోషక విలువలు కలిగినది. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. ప్రస్తుతం తెల్ల బియ్యం వాడకం పెరిగినప్పటికీ..ఆరోగ్య స్పృహ ఉన్నవారు మళ్లీ ఈ మిల్లెట్స్ (చిరుధాన్యాలు) వైపు మళ్లుతున్నారు.
తక్కువ ఖర్చుతో,సులభంగా లభించే ఈ చిరుధాన్యాన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ,గుండె ఆరోగ్యం, రక్తంలో షుగర్ లెవల్స్ ను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. షుగర్ ఉన్నవారికి లేదా మధుమేహం రాకుండా నివారించాలనుకునేవారికి అత్యంత అనువైన ఆహారం. జొన్నలు శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. బువ్వ తినడం లేదా జొన్న అంబలి తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా సహాయపడుతుంది. జొన్న బువ్వను మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

జొన్న బువ్వ తయారీకి కావాల్సిన పదార్థాలు
-జొన్నలు
-ఉప్పు
-నీళ్లు
జొన్న బువ్వ తయారీ విధానం
-ముందుగా 1కప్పు తెల్ల జొన్నలను శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 8 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి.
-తర్వాత జొన్నలను జాలిగరిటలో వేసి 10 నిమిషాలు పక్కన పెడితే నీళ్లు అన్నీ వడ ఆరిపోతాయి.
-తర్వాత జొన్నలను ఒక కాటన్ క్లాత్ లో వేసి అందులోని ఎక్స్ ట్రా తడినంత ఆరనివ్వాలి. చల్లగా ఉండాలి కానీ తడి ఉండకూడదు. ఈ విధంగా ఆరబెట్టుకోవాలి.
-తర్వాత జొన్నలను మిక్సీ గిన్నెలో వేసి మధ్యమధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న జొన్నరవ్వను ఒక గిన్నెలో వేసి ఇందులో 1కప్పు నీళ్లు పోసి బాగా కలపండి.
-తర్వాత స్టవ్ మీద అడుగుమందంగా ఉండే గిన్నెను లేదా కుక్కర్ పెట్టి అందులో 4 కప్పుల నీళ్లు,పావు టీస్పూన్ ఉప్పు వేసి నీళ్లను మరిగించాలి.
-నీళ్ల మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న జొన్నరవ్వ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా నీళ్లలో వేస్తూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ సమయంలో మంటను తక్కువలో ఉంచండి.
-రవ్వ అంతా వేసి కలిపాక మంటను మీడియంలో ఉంచి 2 నిమిషాలు కలుపుతూ ఉడికిస్తే అది చిక్కబడుతుంది.
-తర్వాత దానిమీద మూతపెట్టి మంటను తగ్గించి రవ్వను ఉడికించుకోవాలి. అడుగు అంటుకోకుండా మధ్యమధ్యలో మూత తీసి రవ్వను కలుపుకోవాలి.
-ఉడికిందో లేదో చెక్ చేసుకొని కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత దీనిని ముద్దలా రెడీ చేసుకోండి. అంతే టేస్టీ జొన్న బువ్వ రెడీ. దీనిని టమాటో పచ్చడి లేదా తొక్కుతో తింటే కేక అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
