శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి!

Posted By:

బంగాళదుంప కూర అంటే మన భారతీయులకు మహా ఇష్టం. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల్లో వీటి వాడకం చాలా చాలా ఎక్కవగా ఉంటుంది. ఆలుగడ్డ లేని ఇళ్లు ఉందంటే ఆశ్ర్చర్యపోవాల్సిందే. ఈ కూరలు అయినా, సైడ్ డిష్ లు అయినా, స్నాక్స్ అయినా ఆలుగడ్డ కంపల్సరీగా వాడతారు.

అయితే ఆలుగడ్డతో ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త కొత్తగా, నోటికి రుచిగా ఉండే మజ్జిగ బంగాళదుంప కూర ఎప్పుడైనా ట్రై చేశారా? దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అలాగే టమోటాలు కూడా అస్సలు వాడరు. కార్తీక మాసం, శ్రావణ మాసం లేదా ఇతర పండుగ రోజుల్లో ఉల్లి, వెల్లుల్లి తినని వారికి ఇది పర్ఫెక్ట్ వంటకం. మజ్జిగ బంగాళదుంప కూర ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

The Perfect Satvik Recipe How to Make Buttermilk Potato Curry Pairs Perfectly with Chapati Rice

మజ్జిగ బంగాళదుంప కూర తయారీకి కావాల్సిన పదార్థాలు

గట్టి పెరుగు - ఒకటిన్నర కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
ఆవ నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఉడికించిన బంగాళదుంపలు - 6
ఎండు మిర్చి - 2-3
పచ్చి మిర్చి - 2
అల్లం - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
పసుపు - ¾ టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి - ¾ టీస్పూన్
బ్లాక్ సాల్ట్ - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
కసూరి మెంతి - ఒక పెద్ద చిటికెడు
కొత్తిమీర - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా

పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు!

మజ్జిగ బంగాళదుంప కూర కమ్మని తయారీ విధానం

-ముందుగా బంగాళదుంపలను ఉడికించి, తొక్క తీసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో పెరుగు వేసి, ఎలాంటి ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. ఆపై అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి పలుచటి మజ్జిగలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. కావాలంటే ఈ మజ్జిగలో కొద్దిగా దంచిన అల్లం కలుపుకోవచ్చు.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, అందులో ఆవ నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఎండు మిర్చి, దంచిన అల్లం, పచ్చి మిర్చి, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఇవి వేగాక మంట తగ్గించి.. పసుపు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

-ఇప్పుడు ఈ మసాలా మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న మజ్జిగను పోసి మంటను మీడియంలో పెట్టి, పెరుగు విరిగిపోకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి.

-మజ్జిగ మరుగుతున్న సమయంలో, ఉడికించిన బంగాళదుంప ముక్కలను అందులో వేయాలి. గ్రేవీ చిక్కగా రావడానికి రెండు మూడు బంగాళదుంప ముక్కలను మెత్తగా చిదిమి వేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.

-బంగాళదుంపలు మజ్జిగలో బాగా కలిసి కూర దగ్గరపడ్డాక.. చివర్లో చిటికెడు ఇంగువ, చేతితో నలిపిన కసూరి మెంతి, కొత్తిమీర చల్లుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.

-అంతే మజ్జిగ బంగాళదుంప కూర రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, August 25, 2026, 12:04 [IST]
Desktop Bottom Promotion