Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పప్పు, సాంబార్ లోకి అదిరిపోయే కాంబినేషన్..క్రిస్పీ వంకాయ తవా ఫ్రై ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా మన తెలుగు వారి ఇళ్లలో మధ్యాహ్న భోజనం లేదా రాత్రి విందు అనగానే అన్నం, పప్పు, సాంబార్ తో పాటు నంచుకోవడానికి ఏదో ఒక వేపుడు లేదా పచ్చడి ఉండాల్సిందే. భోజనం ఎంత రుచిగా ఉన్నా, పక్కన ఒక క్రిస్పీ సైడ్ డిష్ ఉంటే ఆ తృప్తే వేరు.
రోజూ తినే కూరలు బోర్ కొట్టినప్పుడు, లేదా తక్కువ సమయంలో ఏదైనా స్పెషల్ గా తినాలనిపించినప్పుడు అద్భుతమైన ఆప్షన్ వంకాయ తవా ఫ్రై. పప్పుచారు అన్నంలోకైనా లేదా సాయంత్రం పూట స్నాక్ లాగానైనా తినడానికి వంకాయ తవా ఫ్రై అద్భుతంగా ఉంటుంది. కేవలం 10-15 నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ రుచికరమైన వంకాయ తవా ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పెద్ద గుండ్రని వంకాయలు: 2-3
కారం: 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి: 1 టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
పసుపు: చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
నిమ్మరసం: 1 టీస్పూన్
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
కరివేపాకు: 2 రెమ్మలు
కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోండి. అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర,ఒక చెంచా నిమ్మరసం, ఒకటి లేదా రెండు స్పూన్ల నూనె వేసి, అన్నింటినీ బాగా కలిపి ఒక చిక్కని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. నీళ్లు కలపకూడదు.
-వంకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడవాలి. వీటిని సుమారు అర అంగుళం మందం ఉండేలా గుండ్రని చక్రాల్లా అంటే స్లైసుల్లా కోసుకోవాలి. మీడియంగా కోసుకోవాలి.
-ఇప్పుడు కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలకు ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ను రెండు వైపులా బాగా పట్టించాలి. మసాలా వంకాయ ముక్కలకు పూర్తిగా అంటుకునేలా చూసుకోవాలి. ఇలా మసాలా పట్టించిన ముక్కలను ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడితే, ఉప్పు కారం ముక్కలకు బాగా పడుతుంది.
-ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం లేదా నాన్ స్టిక్ తవా పెట్టుకోండి. పెనం వేడెక్కాక కొద్దిగా నూనెను బ్రష్ చేయండి లేదా పోయండి. నూనె వేడయ్యాక మసాలా పట్టించిన వంకాయ ముక్కలను పెనంపై ఒకదాని పక్కన ఒకటి పరచి తక్కువ మంట మీద వేయించాలి.
-ఒక వైపు బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యాక, రెండో వైపుకు తిప్పండి. రెండు వైపులా మంచి రంగు వచ్చి, వంకాయ మెత్తబడే వరకు కాల్చుకోవాలి. అంతే వేడి వేడి, కమ్మని వంకాయ తవా ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications