రోటీ, ఇడ్లీలోకి సరికొత్త రుచి కావాలంటే.. కరివేపాకు వెల్లుల్లి తొక్కు ట్రై చేయండి..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

మన ఇళ్లలో ఇడ్లీ,దోసె, వడ,ఉప్మా వంటి టిఫిన్ లోకి నంజుకోడానికి కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, లేదా వేడివేడి సాంబార్ వంటివి చేసుకుంటరు. రోజూ అవే తిని విసుగొచ్చి, ఏదైనా కొత్తగా, కాస్త ఘాటుగా, నోరూరించేలా ఉంటే బాగుండనిపిస్తుందా? అయితే ఓసారి కరివేపాకు వెల్లుల్లి తొక్కు ట్రై చేయండి. తొక్కు అనగానే మనకు అన్నంలో కలుపుకునే పచ్చడి గుర్తుకొస్తుంది. కానీ ఈ ప్రత్యేకమైన తొక్కు ఇడ్లీ, దోశె, చపాతీ, పూరీలకు కూడా ఓ సరికొత్త రుచిని అందిస్తుంది.

దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్కసారి చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఉదయం పూట హడావుడిలో చట్నీ చేసే సమయం లేనప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అందించే ఈ తొక్కు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

The perfect side dish for your breakfast A delicious and tangy Curry Leaf Garlic Thokku Recipe in Telugu
కావాల్సిన పదార్థాలు

రుచి కోసం:
కరివేపాకు - 2 పెద్ద పిడికెళ్లు
వెల్లుల్లి రెబ్బలు - ఒక పెద్ద పిడికెడు
చింతపండు - పెద్ద ఉసిరికాయంత
బెల్లం పొడి - ఒక టీస్పూన్
ఉప్పు - మీ రుచికి సరిపడా
వేయించడానికి:
ఎండు మిరపకాయలు - 8
ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
మిరియాలు - ఒక టీస్పూన్
జీలకర్ర - ఒక టీస్పూన్
మెంతులు - అర టీస్పూన్
తాళింపు కోసం:
మంచి నువ్వుల నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఆవాలు - ఒక టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
పసుపు - అర టీస్పూన్

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేయండి. నూ

-నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలు, చింతపండు వేసి దోరగా వేయించాలి. మిరపకాయలు రంగు మారుతున్నప్పుడు ధనియాలు, మిరియాలు, జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, మెంతులు కూడా వేసి, చిన్న మంట మీద మంచి సువాసన వచ్చే వరకు రెండు నిమిషాల పాటు వేయించండి.

-వేయించిన దినుసులను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్‌ లో వేసి తగినంత ఉప్పు కూడా చేర్చి ఒకసారి గ్రైండ్ చేయండి. ఆ తర్వాత బెల్లం పొడి, శుభ్రం చేసుకున్న రెండు పిడికెళ్ల కరివేపాకు, అర కప్పు నీళ్లు పోసి వీలైనంత మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు అదే బాండీని మళ్లీ స్టవ్ మీద పెట్టి మిగిలిన నూనె వేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అర టీస్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడాక, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత ఇంగువ, పసుపు వేసి ఒక్కసారి కలపండి.

-ఇప్పుడు మనం ముందుగా రుబ్బుకున్న కరివేపాకు పేస్ట్‌ ను తాళింపులో వేసి బాగా కలపాలి. బాండీపై మూత పెట్టి మంటను తగ్గించి సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

-10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలి, తొక్కు దగ్గరపడి ఘుమఘుమలాడుతూ ఉంటుంది. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కరివేపాకు వెల్లుల్లి తొక్కు రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion