Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
జీర్ణశక్తిని పెంచే దివ్యౌషధం..కుక్కర్ లో రాగి సంగటి తయారీ ఎలా చేసుకోవాలంటే..
రాగి సంగటి లేదా రాగి ముద్ద అనేది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన, పోషకమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారం. దీనిని ప్రెషర్ కుక్కర్ లో సులభంగా తయారు చేయవచ్చు. రాగి సంగటి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. రాగి సంగటిని సాధారణంగా వేడి వేడిగా ఉండే పప్పు, సాంబార్, చికెన్ లేదా మటన్ పులుసు లేదా ఏదైనా కూర పులుసుతో తింటారు. రాగి సంగటిని ఇంట్లోనే కుక్కర్ లో ఈజీగా ఎలా తయారుచేపుకోవచ్చో ఇక్కడ చూడండి.
రాగి సంగటి తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగి పిండి
-బియ్యం
-నెయ్యి
-ఉప్పు

రాగి సంగటి తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో ఒక గ్లాసు సోనామసూరి బియ్యం వేసి నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడగి ఆ నీటిని వంపేయండి.
-ఇప్పుడు కడిగిన బియ్యంలో 8 గ్లాసుల నీళ్లు పోసి రైస్ ని 15 నిమిషాలు అలా వదిలిపెట్టేయండి. రైస్ ని నానబెట్టడం వల్ల రైస్ మెత్తగా ఉడుకుతుంది.
-తర్వాత కుక్కర్ ను నేరుగా స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీద 4 విజిల్స్ రానివ్వాలి.
-తర్వాత మూత తీసి మెత్తగా ఉడికిన రైస్ ని గరిటతో మెత్తగా మెదిపినట్లు చేసుకోండి. ఇదే సమయంలో అందులో రుచికి సరిపడా ఉప్పు(1 టీస్పూన్ చాలు)వేసుకోండి. రాగి సంగటిలోకి ఉప్పు ఎక్కువ పట్టదు కాబట్టి చూసుకొని వేసుకోవాలి.
-ఉడికిన రైస్ మెత్తగా అయ్యేటట్లు మెదుపుకున్నాక మళ్లీ స్టవ్ ఆన్ చేసి మంటను తక్కువలో ఉంచి కుక్కర్ లో 2 గ్లాసుల రాగిపండి పైన పరిచినట్లుగా వేసుకొని మూతపెట్టి నిమిషాలు ఉడకనివ్వాలి.
-తర్వాత మూత తీసి గరిటతో మెత్తగా అయ్యేంతవరకు బాగా కలుపుకోండి. ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి.
-తర్వాత అందులో 3 టీస్పూన్ల నెయ్యి వేసి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత సంగటిపై కొన్ని నీళ్లను 2-3 సార్లు చిలకరించుకొని మూతపెట్టి తక్కువ మంట మీద 2 నిమిషాలు అలా వదిలేయండి. ఇలా చేయడం వల్ల అడుగు అంటకుండా సంగటి బాగా మగ్గుతుంది.
-తర్వాత స్టవ్ మీద సంగటిని బాగా కలుపుకోండి.
-తర్వాత ఏదైనా గుంట గిన్నెలో కొంచెం నెయ్యి వేసి గిన్నె అంతా అప్లయ్ చేశాక కొద్దిగా సంగటిని అందులో వేసి చెయ్యి పెట్టి కలపకుండానే గిన్నెను చేత్తో అటు ఇటు తిప్పుతూ ముద్దలా చేసుకోవచ్చు. అలా రాగి సంగటి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
