Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
నెయ్యి తాలింపు,జీడిపప్పుల క్రంచ్..స్వర్గాన్ని తలపించే జొన్న పిండి ఉప్మా..టేస్ట్ వేరే లెవెల్ అంతే!
ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో, మారిన జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో మార్పులు రావడం వల్ల డయాబెటిస్, ఊబకాయం, రక్తపోటు వంటి వ్యాధులు చిన్న వయసులోనే వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మన పూర్వీకులు తిన్న మిల్లెట్స్ వైపు ప్రపంచం మొత్తం మళ్లీ చూస్తోంది. అందులో అత్యంత ముఖ్యమైనవి, మన తెలుగు రాష్ట్రాల్లో విరివిగా పండేవి జొన్నలు.
సాధారణంగా మనం ఉదయం అల్పాహారంగా బొంబాయి రవ్వ లేదా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటాం. కానీ దానికి బదులుగా జొన్న పిండితో ఉప్మా చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి. జొన్న పిండితో చేసే ఉప్మా మృదువుగా, రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలను మన శరీరానికి అందిస్తుంది.

జొన్న పిండి ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు
-జొన్న పిండి
-వేడి నీళ్లు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-అల్లం తురుము
-క్యారెట్
-బీన్స్
-పచ్చి బఠానీలు
-ఆవాలు
-జీలకర్ర
-పచ్చి శనగపప్పు
-పల్లీలు
-జీడిపప్పు
-కొత్తిమీర
-నెయ్యి
-ఉప్పు
జొన్న పిండి ఉప్మా తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
-నూనె వేడయ్యాక అందులో మీకు కావాల్సినన్ని జీడిపప్పు, పల్లీలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత పాన్ లోని నెయ్యిలోనే(కావాలనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోండి)తాలింపు గింజలు వేసి, అవి వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల చీలికలు వేసుకోండి. ఇవి వేగాక అందులోనే సన్నని క్యారెట్ ముక్కలు, సన్నని బీన్స్ ముక్కలు, పచ్చి బఠాణీలు వేసి వేయించుకోవాలి. అవి వేగేటప్పుడే అందులో అల్లం తురుము,రుచికి సరిపడా వేసి వేయించుకోవాలి.
-అన్నీ వేగిన తర్వాత అందులో 3 స్పూన్ల ఉప్మా రవ్వ, అర కప్పు జొన్న పిండి వేసుకొని కలుపుతూ 2 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే వేయించిన పల్లీలు, జీడిపప్పులు కూడా వేసి కలుపుకొని కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకొని అందులో వేడి నీళ్లు(ఒక కప్పు జొన్న పిండికి ఒకటిన్నర కప్పు నీళ్లు) పోసుకొని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి.
-ఉండలు లేకుండా కలుపుకున్నాక మూతపెట్టి మంటను సిమ్ లో పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి.
-2 నిమిషాల తర్వాత మూత తీసి అందులో 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. అంతే జొన్న ఉప్మా రెడీ. నచ్చిన చట్నీతో దీన్ని తింటుంటే స్వర్గమే.
-ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా జొన్న ఉప్మా తీసుకుంటే, రోజంతా అలసట లేకుండా ఉల్లాసంగా, యాక్టివ్ గా పని చేసుకోగలుగుతారు. జొన్న ఉప్మా కొద్దిగా తిన్నా సరే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది త్వరగా జీర్ణం కాకుండా, ఎక్కువ సమయం కడుపులో ఉండి ఆకలిని నియంత్రిస్తుంది. దీనివల్ల పదే పదే తినాలనే కోరిక తగ్గి, బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications