Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
చికెన్ తొక్కు పకోడి తిన్నారా? ఈ ప్రయోగాన్ని ప్రశంసించడానికి పరాయి దేశ ప్రజలు కూడా పరుగెత్తుకొచ్చేస్తారు!
చికెన్ తొక్కు పకోడి అనేది సాధారణ చికెన్ పకోడికి కొంచెం భిన్నంగా, చికెన్ ను ఉడికించి, ఆపై చిన్న చిన్న పీసులుగా చేసి మసాలాలు, పిండితో కలిపి వేయించే ఒక రుచికరమైన స్నాక్. ఇది కరకరలాడుతూ, కారం, ఉప్పు, మసాలాలతో అద్భుతమైన రుచిని ఇస్తుంది. సాయంత్రం వేళల్లో టీ లేదా కాఫీతో పాటు స్నాక్ గా లేదా ఏదైనా ఫంక్షన్‌లో స్టార్టర్‌గా ఇది చాలా బాగుంటుంది. ఇంటికొచ్చిన చుట్టాలకి చిత్ర విచిత్రమైన వంటలతో పిచ్చెక్కించాలంటే ఈ పకోడీ పర్ఫెక్ట్. చికెన్ తొక్కు పకోడీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-చికెన్ బ్రెస్ట్
-ఉప్పు
-కారం
-పసుపు
-నీళ్లు
-శెనగపిండి
-బియ్యప్పిండి
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ధనియాలు జీలకర్ర పొడి
-గరం మసాలా
-నిమ్మరసం
-జీడిపప్పు
-కరివేపాకు
-కోడిగుడ్డు
-ఆయిల్
చికెన్ తొక్కు పకోడి తయారీ విధానం
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు అందులో అర టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు అందులో పావు కేజీ శుభ్రంగా కడిగిన చికెన్ బ్రెస్ట్ లేదా బోన్ లెస్ చికెన్ పెద్ద ముక్కలను వేసి మూతపెట్టి 15 నిమిషాల పాటు తక్కువ మంట మీద నీరు ఇగిరిపోయి ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఉడకనిచ్చి స్టవ్ ఆపేయండి.
-ఉడికించిన చికెన్ ను చేత్తోనే పీసు పీసులుగా చేసి ఓ గిన్నెలో వేసుకోండి. ఇందులోనే అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, అర టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ కారం, అర చెక్క నిమ్మరసం, కొన్ని జీడిపప్పు పలుకులు, కొంచెం కరివేపాకు వేసి మొత్తం అన్నీ కలిసేలా చేత్తో కలుపుకున్నాక ఇందులోనే పావు కప్పు శెనగపిండి, 1 టీస్పూన్ బియ్యప్పిండి, పావు కప్పు నీళ్లు, 4 చెంచాలు గిలకొట్టుకున్న కొడిగుడ్డు మిశ్రమంను కూడా అందులో వేసి మొత్తం బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చెయ్యాలి.
-వేడెక్కిన ఆయిల్ లో కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఆయిల్ లో పకోడీలుగా వేసి గరిట పెట్టకుండా 8-10 నిమిషాల పాటు మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారేదేకా వేయించుకొని తీసి ఓ ప్లేట్ లో వేసుకోండి. అంతే చికెన్ తోక్కు పకోడీ రెడీ.
-వేడివేడిగా ఉన్నప్పుడు టమోటా కెచప్ తో గానీ లేదా నిమ్మరసం పిండుకోని తింటే స్వర్గం కనబడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








