Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పూరీ,చపాతీ,అన్నంలోకి సూపర్ కాంబినేషన్..బంగాళాదుంప కుర్మా ఎలా చేసుకోవాలంటే
మీ కుటుంబంలో అందరూ బంగాళాదుంపలను ఇష్టంగా తింటారా? రోజూ చేసే వేపుడు, కూర కాకుండా ఏదైనా కొత్తగా, రుచిగా చేసి పెట్టాలనుకుంటున్నారా? అయితే అచ్చం చికెన్ కుర్మా రుచిని గుర్తు చేసే బంగాళాదుంప కుర్మా ట్రై చేయండి. కేవలం ఇంట్లో ఉండే బంగాళాదుంపలు, టమోటాలతో సులభంగా తయారు చేసుకోగల ఈ కుర్మా పిల్లల నుంచి పెద్దల వరకు అందరి మనసు దోచుకుంటుంది. ఈ అద్భుతమైన వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-బంగాళాదుంపలు - అర కిలో
-టమోటాలు - 3
-పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
-ఉల్లిపాయ- 1
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
-జీడిపప్పు - 10-12
-దాల్చిన చెక్క - 2 చిన్న ముక్కలు
-లవంగాలు - 2
-సోంపు - అర టీస్పూన్
-గసగసాలు - అర టీస్పూన్
-కరివేపాకు - ఒక రెమ్మ
-కారం - 1 టేబుల్ స్పూన్
-ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్
-పసుపు - అర టీస్పూన్
-కొత్తిమీర - కొద్దిగా
-ఉప్పు - రుచికి సరిపడా
-నూనె - 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
-ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించి, తొక్క తీసి
పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఉల్లిపాయలు, టమోటాలను సన్నగా తరిగి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, సోంపు, గసగసాలు, జీడిపప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి.
-ఒక పాన్ లో నూనె వేడి చేసి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
-ఇప్పుడు కరివేపాకు, టమోటా ముక్కలు వేసి, అవి మెత్తగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి.
-ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు వేయించి ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను జోడించాలి.
-మసాలాలు బంగాళాదుంపలకు బాగా పట్టేలా కలిపి, రుబ్బి పెట్టుకున్న
కొబ్బరి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు నీళ్లు పోసి బాగా
కలపాలి.
మూత పెట్టి మీడియం మంట మీద గ్రేవీ చిక్కబడి, నూనె పైకి తేలేంత వరకు
5-7 నిమిషాల పాటు ఉడికించాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే వేడివేడి, కమ్మనైన బంగాళాదుంప కుర్మా రెడీ. ఇది చపాతీ, పూరీ, దోశ, ఇడ్లీలతో అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుని తిన్నా రుచి అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
