Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
వెజ్ ఫిష్ ఫ్రై ఎప్పుడైనా తిన్నారా? అబ్బో ఏమి టేస్ట్ నెక్స్ లెవల్ అంతే..ఎలా చేసుకోవాలో చూడండి
చేపల ఫ్రై అంటే ఇష్టమా? కానీ మీరు శాకాహారులగా మారిపోయారా? లేదా శాఖాహారులుగా ఉన్నప్పటికీ ఒక్కసారి చేపల ఫ్రై ట్రై చేస్తే బాగుండు అనిపిస్తుందా? అయితే అచ్చం చేపల ఫ్రైని పోలిన రుచితో, అదే రూపంతో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన వెజ్ వంటను తయారుచేసుకోవచ్చు. అదే వెజ్ ఫిష్ ఫ్రై. మీ సాయంత్రపు స్నాక్స్ లేదా భోజనంలోకి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నోరూరించే వెజ్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
వెజ్ ఫిష్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉడికించిన సోయా ముక్కలు - 2 కప్పులు
-పచ్చి అరటిపండ్లు - 2
ఉడికించిన బంగాళాదుంప - 1
-పచ్చిమిర్చి - 2
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
-ధనియాల పొడి - 1 టీస్పూన్
-గరం మసాలా - 1 టేబుల్ స్పూన్
-పసుపు - అర టీస్పూన్
-జీలకర్ర పొడి - అర టీస్పూన్
-నల్ల మిరియాల పొడి - 1 టీస్పూన్
-నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు
-నూనె - 4 టేబుల్ స్పూన్లు
-ఉప్పు - రుచికి సరిపడా
-బొంబాయి రవ్వ (సూజీ) - ఒకటిన్నర కప్పులు
-బియ్యం పిండి - 2 కప్పులు
-కారం - 1 టేబుల్ స్పూన్
-ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం
-వెజ్ ఫిష్ ఫ్రై తయారీకోసం ముందుగా 2కప్పుల సోయా చంక్స్ ను ఉడికించుకోవాలి.
-తర్వాత మిక్సీ జార్ లో ఉడికించిన సోయా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి మెత్తని మిశ్రమంగా గ్రైండ్ చేసుకొని దానిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు పచ్చి అరటిపండ్ల తొక్క తీసి, ఉడికించిన బంగాళాదుంపతో పాటు తురుముకోవాలి. ఈ తురుమును సోయా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. దీనికి ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు జోడించి, అన్నీ కలిసేలా ముద్దలా పిసకాలి.
-చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకుని, సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, అచ్చం చేప ముక్క ఆకారంలో ఒత్తుకోవాలి. చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉండటానికి మధ్యలో ఒక చిన్న రంధ్రం పెట్టుకోవచ్చు.
-ఒక ప్లేట్ లో బొంబాయి రవ్వ, బియ్యం పిండి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తయారు చేసుకున్న వెజ్ చేప ముక్కలను ఈ పొడిలో అన్ని వైపులా బాగా అంటుకునేలా దొర్లించాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత మంటను మీడియంలో ఉంచి పూత పూసిన వెజ్ చేప ముక్కలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా పాన్‌లో వేయాలి. వేసిన వెంటనే కదపకండి, లేదంటే విరిగిపోయే అవకాశం ఉంది.
-ఒక నిమిషం తర్వాత రెండో వైపుకు నెమ్మదిగా తిప్పి రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చి, కరకరలాడే వరకు వేయించుకోవాలి. అంతే వెజ్ ఫిష్ ఫ్రై రెడీ.
-వేడివేడిగా ఉన్న ఈ కరకరలాడే వెజ్ ఫిష్ ఫ్రైని ఒక ప్లేట్ లోకి తీసుకుని, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా,ఉల్లిపాయ ముక్కలతో తింటే ఆ రుచి నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





