Latest Updates
-
ఆరోగ్యానికి, బలానికి బూస్టింగ్ ఫుడ్.. కమ్మనైన స్వీట్ కొబ్బరి రొట్టె.. రోటీ కంటే హెల్తీగా.! -
ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు.. ఇడ్లీలు, దోశలు ఎన్ని తింటారో లెక్కే ఉండదు! -
రక్తహీనతతో బాధపడేవారికి ఈ జ్యూస్ ఒక వరం.. డైలీ ఒక్క గ్లాస్ తాగితే చాలు.! -
షుగర్ వచ్చే ముందు మీ బాడీ చూపించే 5 సంకేతాలు ఏంటో తెలుసా! -
బుధ అస్తమయం: సెప్టెంబర్ 18 వరకు ఈ 4 రాశుల వారికి గడ్డుకాలమే..ఆఫీసులో, వ్యాపారంలో ఊహించని కుట్రలు! -
చాతుర్మాస్య స్పెషల్: ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచినిచ్చే ఆల్ రౌండర్ మసాలా ఇంట్లోనే చేసుకోండిలా.. -
రక్షాబంధన్ 2026: రాఖీ కట్టిన తర్వాత ఎన్ని రోజులకు తీసేయాలి.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.! -
అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు పరమాన్నం.. ఈ టెక్నిక్‌తో పాలు విరిగిపోవు, గట్టిపడదు.! -
సన్నగా ఉండే వారిలోనూ ఫ్యాటీ లివర్.. ఒంట్లో కొవ్వు లేకపోయినా ఈ రిస్క్ తప్పదు.! -
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్!
క్రిస్పీ ఎర్ర కందిపప్పు దోశ..బరువు తగ్గాలనుకునేవాళ్లకి బెస్ట్..ఎలా చేసుకోవాలంటే..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి రోజూ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, బోండా, వడ తిని తిని బోర్ కొట్టిందా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఎర్ర కందిపప్పు దోశ ట్రై చేయండి. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి, డైటింగ్ చేసే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
ఎర్ర కందిపప్పులో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ దోశను ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే, కడుపు నిండిన భావన చాలా సేపటి వరకు ఉంటుంది. తద్వారా పదే పదే ఆకలి వేయదు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. కరకరలాడే ఎర్ర కందిపప్పు దోశ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

ఎర్ర కందిపప్పు దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఎర్ర కందిపప్పు (మసూర్ దాల్) - 1 కప్పు
ఉల్లిపాయ - 1
బంగాళదుంప - 1
పచ్చిమిర్చి - 2
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
గరం మసాలా - అర టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
నెయ్యి - కాల్చుకోవడానికి తగినంత
ఎర్ర కందిపప్పు దోశ తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు ఎర్ర కందిపప్పును నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాక అందులో తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి.
-పప్పు బాగా నానిన తర్వాత నీటిని వంపేసి, ఆ పప్పును మిక్సీ జార్ లో వేసుకోవాలి. అందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చి బంగాళదుంప ముక్కలు, అల్లం, జీలకర్ర, చిటికెడు ఇంగువ, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా వేసి కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ దోశ పిండిలా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి బంగాళదుంప వేయడం వల్ల దోశకు మంచి రుచితో పాటు సాఫ్ట్ నెస్ వస్తుంది.
-పిండి సిద్ధమైన తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి అంతటా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మంటను సిమ్ లో ఉంచి, ఒక గరిటెడు పప్పు పిండిని పెనంపై వేసి గుండ్రంగా దోశలాగా నెమ్మదిగా పరుచుకోవాలి.
-పిండిని పెనంపై పరిచిన వెంటనే, దానిపై సన్నగా తరిగిన పచ్చి కొత్తిమీరను చల్లండి. దోశ అంచుల వెంబడి పైన కొద్దిగా నెయ్యి వేయండి. తక్కువ మంట మీదనే ఒక వైపు ఎర్రగా కాలేలా ఉడకనివ్వాలి. గరిటెతో నెమ్మదిగా నొక్కుతూ కాల్చుకుంటే లోపల కూడా పచ్చిదనం లేకుండా బాగా ఉడుకుతుంది.
-ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకు తిరగేసి కాల్చాలి. నెయ్యి వేసి కాల్చడం వల్ల దోశ అంచులు కరకరలాడుతూ అద్భుతంగా వస్తుంది.
-అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి ఎర్ర కందిపప్పు దోశ రెడీ. వీటిని పుదీనా చట్నీ, పల్లీల చట్నీతో తింటే రుచి అమోఘంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications