Latest Updates
-
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
వర్షాకాలంలో ఇంట్లో చీమల బెడద.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇట్టే తరిమేయండి.!
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే తేమ కారణంగా దుర్వాసన ఏర్పడుతుంది. అయితే దీనికి అదనంగా ఈ కాలంలో మరో సమస్య వెంటాడుతుంటుంది. అదే వంటగదిలో ఎర్ర చీమల సమస్య వర్షాకాలంలో వంటగదితో పాటు ఇంట్లో పలు చోట్ల ఎర్రచీమలు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. అయితే వీటిని ఎలా తరిమికొట్టాలి.. సులభమైన ఇంటి చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.

సాధారణంగా ఎండాకాలం, వర్షాకాలంలో ఇంట్లోకి ఎర్రచీమలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో తేమ కారణంగా గోడలు, మూలాలపైనే కాకుండా ఆహార పదార్థాలకు కూడా చేరతాయి. దీంతో ఆహారాన్ని పడేయాల్సి వస్తుంది. చీమలను తరిమికొట్టేందుకు చీమల మందు వంటి కెమికల్స్‌తో కూడిన వివిధ రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని వాడటం ద్వారా వాటి నుంచి వచ్చే వాసన కారణంగా చిన్న పిల్లలకు ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఇంట్లోనే సహజంగా చీమల నివారణకి పరిష్కారాలు ప్రయత్నించవచ్చు.
వర్షాల కారణంగా భూమిపైన నీరు నిండిపోవడంతో చీమలకు వేరే ఆవాసం లేక ఇంట్లోకి చేరతాయి. ఆహారం కోసం వెతుకుతుంటాయి. ఈ క్రమంలో చీమల బెడద ఎక్కువైపోతుంది. అయితే ఇలా చీమలు చేరినప్పుడు ఒక్కోసారి పసుపు నీళ్లు చల్లుతుంటారు. కానీ తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది. దీని పవర్ ఎక్కువ సేపు ఉండదు. అందుకే పసుపు నీళ్లతో పాటు ఇంకొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
వచ్చా పొడి
వచ్చా పొడి ఆయుర్వేద మందుల్లో ఎంతోకాలంగా ప్రాముఖ్యత చెందింది. ఎండిన చిలగడదుంపను పొడిగా చేయడం ద్వారా ఏర్పడేదే వచ్చా పొడి. వర్షాకాలంలో ఈ పొడిని గోడలపై, కిటికీల అంచులపై, సింక్ కుళాయిల దగ్గర చల్లడం ద్వారా ఫలితం ఉంటుంది. వచ్చా పొడి నుంచి వచ్చే ఘాటైన వాసన చీమలను పారదోలుతుంది. అయితే ఈ పొడిని పిల్లలకు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలని గుర్తుంచుకోండి.
భీమ్‌సేన్ కర్పూరం
సాధారణ కర్పూరంతో పోలిస్తే భీమ్‌సేన్ కర్పూరం ఎక్కువ సేపు సువాసనను కలిగి ఉండటం ద్వారా చీమలను నివారించడానికి ఉత్తమంగా పనిచేస్తుంది. భీమ్‌సేన్ కర్పూరాన్ని చిన్న గుడ్డలో చుట్టి వంటగది మూలల్లో, సింక్‌ల కింద ఉంచాలి. స్టోర్ రూమ్‌లు, కిటికీలు, తలుపుల దగ్గర పెట్టడం ద్వారా ఆ సువాసనకి చీమలు దూరంగా పోతాయి.

పాచౌలీ నూనె
ప్యాచౌలీ నూనె చీమల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. దీని సువాసన ఎక్కువ సేపు నిలిచి ఉండటం ద్వారా చీమలు దూరంగా పారిపోతాయి. ఒక దూది ఉండ తీసుకుని దానిపైన కొన్ని చుక్కల ప్యాచౌలీ నూనె వేసి చీమల దగ్గర ఉంచాలి. దీంతో వఅవి రావడం తగ్గిపోతాయి. గోడలకు, సింకులకు పూయడం ద్వారా చీమలు రాకుండా నివారించవచ్చు.
చీమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వంటగదితో పాటు ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల చీమలు రాకుండా ఉంటాయి. వంటగదిలో ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూత మూసి ఉండాలి. తెరిచి ఉంచితే చీమలు వచ్చే అవకాశం ఉంటుంది. వంటగదిని రాత్రిపూటే శుభ్రం చేసి ఉంచుకోవాలి. గోడలు, నేలల్లో పగుళ్లను పూడ్చి ఉంచడం ద్వారా చీమలు రాకుండా ఉంటాయి. ఇంటి గోడలపై తేమ లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా స్వీట్లు వంటి చిరుతిండ్లను గాలి దూరని డబ్బాల్లో స్టోర్ చేసుకోవడం ద్వారా చీమలు చేరకుండా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
