Latest Updates
-
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ..
మీరు మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నారా.. ఈ ప్రశ్నలతో చెక్ చేసుకోండి.!
రెండు వేర్వేరు నేపథ్యాలు కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రారంభించేదే వివాహ జీవితం. వ్యక్తిగత అభిప్రాయాల నుంచి కుటుంబీకుల వరకూ అన్నిటిలోనూ భార్యాభర్తలు ఒకే మాట మీద ఉంటేనే ఆ బంధం బలంగా ఉంటుంది. అయితే మీ బంధం నిజంగానే బలంగా ఉందా, మీరు మంచి పార్ట్‌నర్ అవుతున్నారా.. అనే విషయాలపై ఎక్కడో ఒక చోట సందేహం నెలకొంటుంది. ఆ సందేహాలను ఈ ప్రశ్నలతో చెక్ చేసుకోవచ్చని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు.

దాంపత్య బంధం బలంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ తప్పనిసరి. ఒకరిపై ఒకరికి గౌరవం, నమ్మకం, ఆప్యాయత, బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా వారి మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంటే ఆ బంధంలో ఎలాంటి పొరపొచ్చాలు ఉండవు. ఈ క్రమంలో మీ బంధం నిజంగానే స్ట్రాంగ్‌గా ఉందా అనేది తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు చెక్ చేసుకోండి..
మీ బంధం బలంగా ఉందా.?
భార్య లేదా భర్త వారి వయసుతో సంబంధం లేకుండా వారి లోపల పసిపిల్లల మనస్తత్వం అనేది కచ్చితంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్‌ను నచ్చిన వారి దగ్గర మాత్రమే ప్రదర్శించగలరు. సిల్లీ జోక్స్ వేసుకోవడం, మనసారా నవ్వుకోవడం, నచ్చినట్లుగా ఉండటం అనేవి ఈ కోవలోకి వస్తాయి. అయితే మీ భాగస్వామితో మీరు, మీతో మీ పార్ట్‌నర్ ఇలా ఉండగలుగుతున్నారా.? అలా ఉన్నట్లయితే.. ఆ బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లని ప్రముఖ సైకాలజిస్టు డా. విజయ పెద్దిన చెబుతున్నారు.

ఎవరికైనా సరే ప్రైవసీ స్పేస్ అనేది ఉంటుంది. భాగస్వామి దగ్గర ఆ వ్యక్తిగత స్పేస్‌ను ఎంజాయ్ చేయగలుగుతున్నారా.? అనేది కూడా ఇక్కడ ముఖ్యం. మీ స్నేహితులు, మీ అలవాట్లు, మీ వర్క్ ఇలా మీకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీ భాగస్వామి దగ్గర స్వేచ్ఛగా ఉండగలిగితే ఆ బంధం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు అర్థం.
మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే.. మీ భాగస్వామి కూడా ఆ సమస్య తనదిగా భావించి మీతో కలిసి పరిష్కరించినట్లయితే ఇక ఆ బంధానికి ఢోకా ఉండదు. ఈ విషయంలో మీ పార్ట్‌నర్ మీకు మద్దతుగా ఉంటున్నారా? పరిశీలించుకోండి.
ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్‌ని గమనించి వాటికి రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నారా అనేది కూడా ఆ బంధం ఎంత బలంగా ఉందనేది చెబుతుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ఎడమొహం పెడమొహం కాకుండా ప్రేమతో ఆ సమస్యను పరిష్కరించుకుంటున్నారా అనేది కూడా ఒక బంధం లోతును సూచిస్తుంది. మీ భాగస్వామితో ఈ విషయాల్లో మీరు సానుకూలంగా ఉన్నట్లయితే మీ బంధం పదిలంగా ఉన్నట్లేనని సూచిస్తున్నారు.
మీరు మంచి పార్ట్‌నర్ అవుతున్నారా.?
దాంపత్య జీవితం అన్నాక ఇద్దరి మధ్యా గొడవలు వస్తుంటాయి. ఒకసారి భార్య తప్పు ఉండొచ్చు. మరోసారి భర్త పొరపాటు ఉండొచ్చు. అయితే కొందరు వారి తప్పులను ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ ఏదైనా గొడవ జరిగాక.. తమదే తప్పు అని తెలుసుకుని క్షమించమని అడిగినట్లయితే మీరు భాగస్వామి పట్ల మంచిగా ఉన్నారని అర్థమని విజయ పెద్దిన చెబుతున్నారు.
పనుల్లో సాయం
మీరు మీ భాగస్వామి కోసం చిన్న చిన్న పనులు, త్యాగాలు చేయగలుగుతున్నారా అనేది కూడా మీ భాగస్వామిపై మీ బాధ్యతను సూచిస్తుంది. వారు బిజీగా ఉన్నప్పుడు చిన్నపాటి సహాయం, అడగకుండానే పనుల్లో తోడ్పడటం వంటివి మీరు ఎంత మంచి పార్ట్‌నర్ అనేది చెబుతుంది. అదేవిధంగా వారి విషయంలో మీ మాటలు, మీ చర్యలు ఎంత నిలకడగా ఉన్నాయనేది కూడా ముఖ్యం.
నిజాయితీ
మీరు మీ భాగస్వామితో నిజాయతీగా ఉంటున్నారా అనేది కూడా వారిపై మీ ప్రేమను తెలియజేస్తుంది. కుటుంబంలో కానీ బయట కానీ ఏవైనా ప్రతికూల సంఘటనలు తలెత్తినప్పుడు వారికి మీరు ఎంత మద్దతు ఇస్తున్నారు.. వారితో మీరు ఎంత వరకు నిలబడుతున్నారనేది కూడా వారిపై మీ బాధ్యతను ప్రతిబింబిస్తుంది.
గౌరవం కాపాడటం
కొన్ని సందర్భాల్లో ఇంట్లో లేదా నలుగురి ఎదుట భాగస్వామిని చులకన చేయడం చూస్తుంటాం. అయితే మీరు మీ పార్ట్‌నర్‌తో నాలుగు గోడల మధ్య, నలుగురిలో ఎలా ఉంటున్నారు.. వారిని ఉద్దేశపూర్వకంగా కించపరుస్తున్నారా.. లేక వారి గౌరవాన్ని కాపాడుతున్నారా అనే దానిపై మీ భాగస్వామి విషయంలో మీరు ఎలా ఉంటున్నారనేది అద్దం పడుతుంది.
మీ భాగస్వామి విషయంలో పైన చెప్పిన అంశాలను చెక్ చేసుకోవడం ద్వారా ఒకరిపై ఒకరికి అభిప్రాయం, ప్రేమ, గౌరవం ఎంతవరకు ఉందనేది పరిశీలనకు రావచ్చు. వీటిలో ఏమైనా లోటుపాట్లు కనిపించినా.. ఇక నుంచైనా వాటిని సరిచేసుకుని మీ దాంపత్య బంధాన్ని సంపూర్ణం చేసుకుంటూ ఆనందంగా ఆస్వాదించండి.



Click it and Unblock the Notifications
