జలుబు, దగ్గు పరార్.. కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన వెల్లుల్లి కొత్తిమీర సూప్ చేసుకోండిలా..

Posted By:

చలికాలం వచ్చేసింది. చల్లటి గాలికి ఉదయం లేదా సాయంత్రం వేళ ఏదైనా వేడివేడిగా తాగాలనిపించడం సహజం. సాధారణంగా ఇలాంటి వాతావరణంలో మనకు ముందుగా గుర్తొచ్చేది టీ లేదా కాఫీ. కానీ రోజూ అవే తాగి బోర్ కొట్టిందా? అయితే కాస్త కొత్తగా, ఆరోగ్యానికి మేలు చేసేలా, నోటికి రుచిగా ఉండే వేడివేడి సూప్ ఏదైనా ఉంటే అదిరిపోతుంది. అదే వెల్లుల్లి కొత్తిమీర సూప్.

చలికాలంలో ఈ సూప్ కేవలం రుచినే కాదు, జలుబు, గొంతు నొప్పి నుండి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఇంట్లో ఉండే అతి తక్కువ పదార్థాలతో, కేవలం ఐదు నిమిషాల్లో దీన్ని సులభంగా తయారుచేసుకోవచ్చు. వెల్లుల్లి ఘాటు, కొత్తిమీర సువాసన, మిరియాల రుచి కలగలిసిన ఈ సూప్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

The Ultimate Winter Remedy Quick Garlic Coriander Soup Recipe for Cold Sore Throat

కావలసిన పదార్థాలు

నెయ్యి లేదా నూనె - 1 టీస్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు -9
కొత్తిమీర తరుగు - ఒక గుప్పెడు
మిరియాలు - 10
నీళ్లు - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - కొద్దిగా

చలికాలం స్పెషల్ రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్ రిచ్ పెసరపప్పు సూప్..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక చిన్న పాన్ లేదా గిన్నె పెట్టుకోండి. అందులో ఒక టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క ముక్క, వెల్లుల్లి రెబ్బలు, సగం తరిగిన కొత్తిమీర వేసి వేయించండి. సుమారు ఒక నిమిషం పాటు వీటిని సన్నని మంటపై వేయించాలి.

-ఇప్పుడు ఆ పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోయండి. ఆ నీళ్లలో తాజాగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి, మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే మిగిలిన సన్నటి కొత్తిమీర తరుగును వేసి గరిటెతో బాగా కలపండి.

-ఇప్పుడు మంటను కాస్త తగ్గించి, సూప్‌ ను 3 నుండి 4 నిమిషాల పాటు సన్నని సెగపై బాగా మరగనివ్వండి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి, దాల్చిన చెక్క, కొత్తిమీరలోని ఔషధ గుణాలు, సువాసనలు ఆ నీటిలోకి పూర్తిగా చేరి సూప్ రుచి అమోఘంగా మారుతుంది.

-సూప్ చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేయండి. దాన్ని వేడివేడిగా ఒక బౌల్‌ లోకి తీసుకోండి. పైన కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే.. ఆ పులుపు, మిరియాల ఘాటు కలగలిసి అమృతంలా అనిపిస్తుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, November 10, 2026, 15:58 [IST]
Desktop Bottom Promotion