Latest Updates
-
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ -
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే..
ఎముకలకు పుష్ఠి,ఎన్నో అనారోగ్యాలకు సంజీవని 'గోంద్ లడ్డు'..ఎలా చేసుకోవాలంటే
మనదేశంలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన, పోషకమైన వంటకాల్లో గోంద్ లడ్డు ఒకటి.సాధారణంగా దీన్ని చలికాలంలో ఎక్కువగా తయారుచేస్తుంటారు. మిగతాకాలాల్లో కూడా దీన్ని తయారుచేస్తుంటారు. ఇది కేవలం రుచికరమైన తీపి వంటకం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే ఒక బలవర్ధకమైన ఆహారం. సంప్రదాయబద్ధంగా ప్రసవం తర్వాత స్త్రీలకు, అలాగే చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచడానికి,ఎముకలకు పుష్ఠినిచ్చే ఈ లడ్డూలను తయారుచేస్తారు. గోంద్ లడ్డు తయారీకి సాధారణంగా ఇంట్లో లభించే, సులభంగా దొరికే పదార్థాలు అవసరం అవుతాయి. ఈ పదార్థాలన్నీ పోషకాలతో నిండి ఉంటాయి. గోంద్ లడ్డూని మీ ఇంట్లోనే సలుభంగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
గోంద్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు
-గోంద్
-బాదంపప్పు
-జీడిపప్పు
-ఖర్బూజ గింజలు
-నెయ్యి
-గసగసాలు
-ఎండుకొబ్బరి తురుము
-గోధుమ పిండి
-బెల్లం

గోంద్ లడ్డు తయారీ విధానం
-ముందుగా పావు కప్పు బాదంపప్పు,పావుకప్పు జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మొత్తం కలిపి అరకప్పు ఉండాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 1 కప్పు ఎండుకొబ్బరి తురుము వేసి మీడియం మంట మీద 2-3 నిమిషాలు వేయించి ఓ ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బాండీలోనే 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి చిట్లనివ్వాలి. ఆ తర్వాత వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బాండీలోనే పావు కిలో నెయ్యిలో కొంత వేసి అందులో కట్ చేసుకున్న డ్రైఫ్రూట్స్, 2 టేబుల్ స్పూన్ల ఖర్బూజ గింజలు కూడా వేసి 1 నిమిషం తక్కువమంట మీద వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో 100 గ్రాముల గోంద్(అకాసియా గమ్)వేసి వేయించాలి. గోంద్ వేగి సగ్గుబియ్యంలా పొంగుతుంది. అప్పుడు దాన్ని తీసి ఓ ప్లేట్ లో పెట్టుకోండి.
-వేయించిన గోంద్ చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలో వేసి 2-3 సార్లు పల్స్ ఇస్తూ చేసుకుంటే చాలు.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలొ ఇంకొంచెం నెయ్యి వేసి వేడి చేసి అందులో 100 గ్రాముల గోధుమ పిండి వేసి మంచి రంగు,సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.
-గోధుమపిండి మంచి సువాసన వస్తున్న సమయంలో దాన్ని వేయించి అన్నీ పెట్టుకున్న ప్లేట్ లో వేసేయండి. మక్సీలో పల్స్ చేసుకున్న గోంద్ కూడా ఇందులో వేసి మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసి అందులో 250 గ్రాముల బెల్లం తరుము వేసి ఓ తీగ పాకం వచ్చేదాకా మరిగించాలి. పాకం చిక్కగా ఉన్నప్పుడు అందులో అర టేబుల్ స్పూన్ యాలకల పొడి,అర టేబుల్ స్పూన్ సొంటి పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసేయండి.
-ఇప్పుడు బెల్లం పాకంలో వేయించిన పదార్థాల మిశ్రమం మొత్తం వేసేసి బాగా కలిపి 5 నిమిషాలు పక్కన ఉంచండి.
-మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని అడ్డూల్లా చుట్టుకోండి. అంతే గోంద్ లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
