Latest Updates
-
తిరుమల శ్రీవారి ప్రసాదం మలహోర.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
అనిరుధ్ - కావ్య మారన్ వెడ్డింగ్: గ్రీస్లోనే పెళ్లి ఎందుకు? అక్కడ ఉన్న ప్రత్యేకతలేంటి? -
జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి -
రొమాంటిక్ మూడ్ చెడిపోకూడదంటే.. ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విషయాలు అస్సలు మాట్లాడకండి -
చలికాలంలో మాత్రమే దొరికే లక్నో ఫేమస్ మఖన్ మలై.. మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
వంటకు ఏ నూనె వాడితే ఆరోగ్యానికి మంచిది? -
జలుబు, దగ్గు పరార్.. కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన వెల్లుల్లి కొత్తిమీర సూప్ చేసుకోండిలా.. -
భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సెల్యూట్స్ ఒకేలా ఎందుకు ఉండవో తెలుసా? -
చలికాలంలో ఏ రోటీలు తింటే ఆరోగ్యానికి మంచిది? సజ్జ, జొన్న, రాగి లేదా గోధుమ? -
రోజూ నిమ్మరసం తాగుతుంటే కిడ్నీ రాళ్లు రావా?
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి!
ఒక్కోసారి పాలు విరిగిపోవడం సర్వసాధారణం. పాలు విరిగిపోగానే పాడైపోయాయని భావించి వెంటనే వాటిని సింక్లో పారబోస్తుంటాం. కానీ విరిగిపోయిన పాలని వంటగదిలో ఓ అద్భుతమైన పదార్థంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా?
విరిగిన పాలతో నోరూరించే స్వీట్స్ చేయడమే కాకుండా, ఆ మిగిలిన నీటితో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో వంటకాలు చేయవచ్చు. పాలు విరిగినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునే 5 అద్భుతమైన మార్గాల గురించి ఇక్కడ చూడండి.

ఇంట్లోనే స్వచ్ఛమైన, మృదువైన పనీర్ తయారీ
విరిగిన పాలను పారబోయకుండా వాటితో మార్కెట్లో దొరికేంత సాఫ్ట్ పనీర్ చేయవచ్చు. విరిగిన పాలను స్టవ్ మీద ఉంచి కాస్త వేడి చేయండి. పాలు పూర్తిగా విరగకపోతే కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ కలపండి. ఇప్పుడు ఒక శుభ్రమైన పలుచటి కాటన్ వస్త్రంలో ఈ పాలను వడకట్టండి. ఆ మూటను గట్టిగా పిండి, 20-30 నిమిషాల పాటు ఏదైనా బరువైన వస్తువు కింద ఉంచండి. అంతే ఎంతో తాజా, మృదువైన పనీర్ రెడీ.
నోట్లో వేసుకుంటే కరిగిపోయే కలకండ్
విరిగిన పాలతో వచ్చిన ముద్ద (చెనా)తో అద్భుతమైన స్వీట్ చేయవచ్చు. ఈ చెనాకు కొద్దిగా పాలపొడి, పంచదార, యాలకుల పొడి కలిపి పాన్ లో తక్కువ మంటపై వేయించండి. ఈ మిశ్రమం దగ్గరపడి, పాన్ కు అంటుకోకుండా విడిపోతున్నప్పుడు, ఒక ట్రేలో నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని సమానంగా పరచండి. చల్లారాక బర్ఫీల్లా కట్ చేసుకోండి. అచ్చం స్వీట్ షాపులో దొరికే రుచికరమైన కలకండ్ నిమిషాల్లో రెడీ అవుతుంది.
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి!
దూదిలాంటి మెత్తటి రోటీలు, పరాటాలు
చపాతీలు మృదువుగా రావాలంటే విరిగిన పాలు లేదా ఆ నీరు బెస్ట్ ఆప్షన్. పాలను వడకట్టగా వచ్చిన పుల్లటి నీటితో గోధుమ పిండిని కలపండి. పూరీలు లేదా భటూరాల పిండి కూడా ఇలాగే కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ రోటీలు దూదిలా మెత్తగా, పొంగుతూ వస్తాయి. అంతేకాదు పాలల్లో ఉండే ప్రొటీన్ వల్ల మీ ఆహారానికి అదనపు పోషకాలు అందుతాయి.
కూరలు, సూప్ లకు క్రీమీ టెక్స్చర్
ఇంట్లో చేసే షాహీ పనీర్, బటర్ మసాలా, చోలే లాంటి గ్రేవీ కూరలు రెస్టారెంట్ స్టైల్ రుచితో రావాలంటే విరిగిన పాలను వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసి గ్రేవీలో కలపండి. ఇది కూరకు అద్భుతమైన రుచితో పాటు, రిచ్ అండ్ క్రీమీ ఆకృతిని ఇస్తుంది.
పోషకాల గని.. విరిగిన పాల నీరు
పాలను వడకట్టగా మిగిలిన నీటిని వృధాగా పారబోయకండి. ఇది ప్రొటీన్లు, ఖనిజాలతో నిండిన పోషకాల గని. ఈ నీటిని పప్పు ఉడికించడానికి, అన్నం వండటానికి లేదా సూప్స్ తయారీలో వాడుకోవచ్చు. అంతేకాదు మళ్లీ పాలు విరగ్గొట్టి పనీర్ చేయాలనుకున్నప్పుడు ఈ నీటినే నాచురల్ స్టార్టర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
