Latest Updates
-
ప్రధానినైనా అరెస్ట్ చేయొచ్చు..కానీ మనదేశంలో ఈ ఇద్దరినీ ఎవ్వరూ టచ్ చేయలేరు! -
ఒంట్లో వేడిని తగ్గించే, ఇమ్యూనిటీ పెంచే సూపర్ టేస్టీ చిన్న ఉల్లిపాయల సాంబార్.. -
ప్రెగ్నెన్సీ ప్రయత్నాల్లో ఉన్నారా.. పీరియడ్స్‌లో ఈ మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
Viral Video: సాఫ్ట్ వేర్ జాబ్ దండగ..ఈ ఐడియా సూపర్!..పెట్టుబడి లేకుండా 3 గంటల పనితో నెలకు రూ. 70 వేల ఆదాయం -
పూజలో ఉపయోగించే ఐదు దీపాల అర్థం ఏమిటి? -
నెలకు రూ.2.8 లక్షల జీతం..పని ఏంటంటే ఇతరుల తరపున 'బ్రేకప్' చెప్పడమే! -
ప్రొటీన్ పవర్.. అదిరిపోయే ఫ్లేవర్..అఫ్ఘానీ సోయా కర్రీ తయారీ విధానం ఇదే.. -
ఏం తిన్నా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తోందా? అసలు కారణం ఫుడ్ కాదు.. -
చేపల కూర అంటే ఇలా ఉండాలి భయ్యా.. ఘుమఘుమలాడే బిహారీ స్టైల్ ఫిష్ కర్రీ! -
సాధారణ నొప్పులే కదా అని లైట్ తీసుకుంటున్నారా? క్యాన్సర్ ముప్పు కావచ్చు!
ఎండాకాలంలో పొట్టకు చల్లగా..జస్ట్ 5 నిమిషాల్లో సూపర్ టేస్టీ పెరుగన్నం తాలింపు..ఎలా చేసుకోవాలంటే..
పెరుగన్నం మన సంప్రదాయంలో, దైనందిన జీవితంలో ఒక భాగం. ఇది కేవలం కడుపు నింపే ఆహారం మాత్రమే కాదు, అమృతంతో సమానమైన ఆరోగ్య ప్రదాయిని. ముఖ్యంగా పెరుగన్నానికి తాలింపు (పోపు) వేసి తింటే ఆ రుచి, కమ్మదనం మర్చిపోలేరు. చిన్నపిల్లల నుండి పండు ముసలి వారి వరకు అందరికీ ఇష్టమైన, సులభంగా జీర్ణమయ్యే ఈ పెరుగన్నం తాలింపుని కేవలం 5 నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. ఇది తయారు చేయడం ఎంత సులభమో, దీని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంత అమోఘం. ముఖ్యంగా ఎండాకాలంలో ఇది మీ పొట్టను చల్లగా ఉంచడమే కాకుండా మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా దీన్ని చేసుకోవచ్చు.

ఉడికించిన రైస్- 1 కప్పు
పెరుగు- అర లీటరు
ఉల్లిపాయ- 1
పచ్చిమిరపకాయలు- 2
అల్లం తరుగు- 1 టీస్పూన్
మిరియాలు- 1 టీస్పూన్
పోపు దినుసులు- 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి- 2
ఆయిల్- 1 టేబుల్ స్పూన్
ఉప్పు- తగినంత
కొత్తిమీర- కొద్దిగా
కరివేపాకు- కొద్దిగా
పెరుగన్నం తాలింపు తయారీ విధానం
-పెరుగన్నం తాలింపు చేయడానికి రైస్ మెత్తగా ఉండాలి. ఒక వేళ రైస్ పొడిపొడిగా కనుక ఉంటే ఒక గరిటతో దాన్ని అదిమినట్లు చేస్తూ మెత్తగా చేసుకోవాలి.
-రైస్ ను మెత్తగా చేసిన తర్వాత అందులో ఉప్పు, పెరుగు, పావు గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో పచ్చిమిర్చి చిన్న గుండ్రాటి ముక్కలు, అల్లం తరుగు, దంచిన మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేశాక పోపు దినుసులతో పాటు చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగాక అందులోనే ఎండు మిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
-వేగిన తాలింపుని కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసి కలుపుకోవాలి. చివర్లో పెరుగన్నంలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి.
-అంతే సూపర్ టేస్టీ పెరుగన్నం తాలింపు రెడీ. దీన్ని నచ్చిన ఊరగాయతో కలిపి తింటుంటే స్వర్గమే.
-పెరుగన్నం మరింత ఆరోగ్యకరంగా,క్రంచీగా ఉండాలంటే అందులో సన్నగా తురిమిన క్యారెట్, కీరా దోసకాయ ముక్కలు కలుపుకోవచ్చు. వేసవికాలంలో మామిడిపండు ముక్కలు, నల్ల ద్రాక్ష లేదా పచ్చ ద్రాక్ష పండ్లను పెరుగన్నంలో కలుపుకుని తింటే ఆ మధురమైన రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications