For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాంగీ బాత్ రెసిపి: కర్ణాటక స్టైల్ వంకాయ రైస్ చేయటం ఎలా ? వాంగీ బాత్ తయారీ

Written By: DEEPTHI T A S
|

వాంగీ భాట్ లేదా వంగీ బాత్ ప్రపంచంలోనే అన్నిటికన్నా రుచికరమైన బియ్యపు వంటకం, ఇది మన చేతుల్లో పడటం నిజంగా చాలా అద్భుతం. పైగా ఈ సాంప్రదాయపు కర్ణాటక స్టైల్ వంకాయ రైస్ రెసిపి ఎంత సులభంగా చేయచ్చో మనకిప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయమే!

వంకాయ పోషకవిలువలకి,యాంటీఆక్సిడెంట్ లక్షణాలకి ప్రసిద్ధి, దీన్ని అన్నంతో కలపటం పొట్టకి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా రుచికరమైన పండగలాంటిది. ఇది ఒక ఆరోగ్యకరమైన కడుపునింపే మంచి బ్రేక్ ఫాస్ట్ వంటకం.

వాంగీ బాత్ లో ఈ రెసిపి కోసమే ప్రత్యేకంగా వాడే భారతీయ దినుసుల సువాసనలన్నీ దేనికవి అందంగా అమరిపోతాయి. వేయించిన సెనగపప్పు, మినపప్పు, అలాగే దినుసులైన లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, వాటితో మెంతులు, ధనియాల కలయిక అన్నీ కలిపి ఈ వంటకానికి మాటల్లో చెప్పలేని రుచిని అందిస్తాయి.

అన్నం మెత్తదనం, వంకాయల రుచి కలిసి ఈ రెసిపికి ప్రత్యేకమైన ఫ్లేవర్ కలిగించటంతో, అందరూ మెచ్చే మేటి బియ్యం వంటకాలలో ఇది ప్రసిద్ధి అనటంలో ఏ సందేహం లేదు.

ప్రాచీనకాలంలో మన ఇంటి కూరల్లో దాదాపు ప్రతిరోజూ వాడుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచీ వంకాయలు లేదా బైంగన్స్ మన సంస్కృతిలో భాగమైపోయాయి. మీకు నచ్చినా లేకున్నా దాని నుంచి దూరం అయితే పోలేరు, అయితే గియితే కాయగూరలు, అదీ వంకాయ కూర తినకుండా కంచం ముందునించి లేవనిచ్చే తల్లిదండ్రులు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.

మీకు నచ్చినా లేకపోయిమ ఇటీవల పరిశోధనల్లో ఈ వంకాయలు లేదా ఎగ్ ప్లాంట్’స్ లో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉండి,మీ వయస్సు మీరకుండా చేసి, ఎక్కువ ముఖ్య పోషకాలన్నిటినీ అందిస్తాయి. అందుకే ఈ రెసిపి మీ ఇంట్లో ప్రయత్నించి ఎలా వస్తుందో చూడటానికి ఈ కారణాలు చాలు కదా!

కిందకి వెళ్ళి వీడియో సూచనలు,అలాగే బొమ్మలతో సూచనలు చదవండి. వచ్చే ఆదివారం భోజనంలో ఇదే మీ స్టార్ రెసిపి కావచ్చు. హాయిగా ఆనందించండి!

వాంగీబాత్ రెసిపి । వంకాయ రైస్ ను ఎలా తయారుచేయాలి । కర్ణాటక స్టైల్ లో వాంగీబాత్ రెసిపి । వాంగీ బాత్ స్టెప్ బై స్టెప్ । వాంగీబాత్
వాంగీబాత్ రెసిపి । వంకాయ రైస్ ను ఎలా తయారుచేయాలి । కర్ణాటక స్టైల్ లో వాంగీబాత్ రెసిపి । వాంగీ బాత్ స్టెప్ బై స్టెప్ । వాంగీబాత్ వీడియో
Prep Time
20 Mins
Cook Time
25M
Total Time
45 Mins

Recipe By: కావ్య

Recipe Type: అల్పాహారం

Serves: ఇద్దరికి

Ingredients
 • వంకాయలు 4-5

  కొత్తిమీర - చేతిలో పట్టినన్ని

  చింతపండు రసం -1 చెంచా

  ధనియాలు -1 చెంచా

  నూనె- అలంకరణకి + వేయించటానికి

  ఎర్రమిర్చి (ఎండినది) -5-6

  పొడి కొబ్బరి (తురిమినది) -1/2 కప్పు

  బియ్యం -1 కప్పు

  ఆవాలు - 1చెంచా

  మినపప్పు-1 చెంచా

  సెనగపప్పు -1 చెంచా

  మసాలాదినుసులు (ఏలకులు, దాల్చినచెక్క, లవంగాలు) -1 చెంచా

  బెల్లం - 1చెంచా

  ఉప్పు - రుచికి

  నువ్వులు -1చెంచా

  మెంతులు -1 చెంచా

  జీలకర్ర -1 చెంచా

  కరివేపాకు -7-8

  పసుపుపొడి - 1 చెంచా

How to Prepare
 • 1. ఒక బౌల్ తీసుకుని బియ్యం వేయండి.

  2. నీళ్ళు పోసి బాగా కడగండి.

  3. కుక్కర్ తీసుకుని ఆ బియ్యాన్ని అందులో వేయండి.

  4. నీరు పోయండి.

  5. 3 విజిల్స్ ఒచ్చాక కుక్కర్ ఆపండి.

  6. అన్నాన్ని ఒక పక్కన పెట్టుకోండి.

  7. వంకాయలు తీసుకుని సన్నగా ముక్కలు తరగండి.

  8. అన్ని ముక్కలను ఒక బౌల్ నీళ్లలో వేయండి.

  9. ఒక పెనం తీసుకోండి.

  10. నూనె వేయండి.

  11. మినప్పప్పు,జీలకర్ర, సెనగపప్పు, నువ్వులు, మెంతులు, లవంగాలు, ధనియాలను వేయండి.

  12. అన్నిటినీ కలపండి.

  13. ఎండుమిర్చి, తురిమిన కొబ్బరి వేసి మళ్ళీ కలపండి.

  14. కొబ్బరి మరియు ఇతర దినుసుల వాసన తెలిసేదాకా పొడిగా అన్నిటినీ వేయించండి.

  15.3-4 నిమిషాలపాటు చల్లబడనివ్వండి.

  16.అన్ని దినుసులను మిక్సీలో వేయండి.

  17. పొడి అయ్యేవరకూ మిక్సీ పట్టండి

  18. పెనం తీసుకోండి.

  19.నూనె, ఆవాలు, మినపప్పు, సెనగపప్పు, కరివేపాకు, పసుపు, వంకాయలు వేసి నిమిషంపాటు కలపండి.

  20.చింతపండు రసం,బెల్లం వేసి బాగా కలపండి.

  21. ఉప్పు వేయండి.

  22. అన్నిటినీ కలిపి 2-3 నిమిషాలు ఉడకనివ్వండి.

  23. దినుసుల మిశ్రమాన్ని వేసి బాగా అన్నిటినీ కలపండి.

  24. మూతపెట్టి 2-3 నిమిషాలను ఉడకనివ్వండి.

  25. మూత తీసి వంకాయలను కలపండి.

  26.అన్నం వేసి బాగా కలపండి

  27. కొత్తిమీరతో అలంకరించి బౌల్ లోకి తీసుకోండి.

  28.మీకు నచ్చిన పచ్చడి లేదా పెరుగుతో వడ్డించండి.

Instructions
 • 1.అన్నాన్ని ముందే వండుకొని వంకాయ మిశ్రమంతో కలిపేముందు కొన్ని గంటలు చల్లబడనివ్వండి. 2.వంకాయలను కొద్దిసేపు నాననివ్వండి, అలా అయితే వండటానికి తక్కువ సమయం పడుతుంది.
Nutritional Information
 • వడ్డించే పరిమాణం - 1 బౌల్
 • క్యాలరీలు - 150
 • కొవ్వు - 7గ్రాములు
 • ప్రొటీన్ - 2 గ్రాములు
 • కార్బొహైడ్రేట్లు - 18 గ్రాములు
 • ఫైబర్ - 2 గ్రాములు

స్టెప్ బై స్టెప్ – వాంగీ బాత్ ను ఎలా తయారుచేయాలి

1. ఒక బౌల్ తీసుకుని బియ్యం వేయండి.


2. నీళ్ళు పోసి బాగా కడగండి.
3. కుక్కర్ తీసుకుని ఆ బియ్యాన్ని అందులో వేయండి.
4. నీరు పోయండి.
5. 3 విజిల్స్ ఒచ్చాక కుక్కర్ ఆపండి.

6. అన్నాన్ని ఒక పక్కన పెట్టుకోండి.


7. వంకాయలు తీసుకుని సన్నగా ముక్కలు తరగండి.
8. అన్ని ముక్కలను ఒక బౌల్ నీళ్లలో వేయండి.
9. ఒక పెనం తీసుకోండి.
10. నూనె వేయండి.
11. మినప్పప్పు,జీలకర్ర, సెనగపప్పు, నువ్వులు, మెంతులు, లవంగాలు, ధనియాలను వేయండి.
12. అన్నిటినీ కలపండి.
13. ఎండుమిర్చి, తురిమిన కొబ్బరి వేసి మళ్ళీ కలపండి.
14. కొబ్బరి మరియు ఇతర దినుసుల వాసన తెలిసేదాకా పొడిగా అన్నిటినీ వేయించండి.

15.3-4 నిమిషాలపాటు చల్లబడనివ్వండి.

16.అన్ని దినుసులను మిక్సీలో వేయండి.


17. పొడి అయ్యేవరకూ మిక్సీ పట్టండి
18. పెనం తీసుకోండి.

19.నూనె, ఆవాలు, మినపప్పు, సెనగపప్పు, కరివేపాకు, పసుపు, వంకాయలు వేసి నిమిషంపాటు కలపండి.


20.చింతపండు రసం,బెల్లం వేసి బాగా కలపండి. 21. ఉప్పు వేయండి. 22. అన్నిటినీ కలిపి 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. 23. దినుసుల మిశ్రమాన్ని వేసి బాగా అన్నిటినీ కలపండి. 24. మూతపెట్టి 2-3 నిమిషాలను ఉడకనివ్వండి.
25. మూత తీసి వంకాయలను కలపండి.
26.అన్నం వేసి బాగా కలపండి
27. కొత్తిమీరతో అలంకరించి బౌల్ లోకి తీసుకోండి.
28.మీకు నచ్చిన పచ్చడి లేదా పెరుగుతో వడ్డించండి.
[ 4.5 of 5 - 86 Users]
English summary

Vangi Bhaat Recipe | How To Make Brinjal Rice | Vangi Bath Recipe

Vangi Bhaat Recipe , How To Make Brinjal Rice , Vangi Bath Recipe,Vangi bhaat, or brinjal rice, is one of our favourite rice platter recipes, as the blend of Indian spices and vegetables gives this dish an exquisite flavour and aroma, impossible to miss out on. Vangi bhat is loaded up with the goodness of brinjals and
Story first published: Tuesday, March 20, 2018, 13:30 [IST]