Latest Updates
-
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు? -
Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి -
వేగంగా బరువు తగ్గించే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. డయాబెటిస్‌ని ఈజీగా కంట్రోల్ చేసే కీర సలాడ్.!
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు!
సాయంత్రం వేళ చల్లటి గాలి వీస్తున్నప్పుడైనా.. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చున్నప్పుడు వేడివేడి టీతో పాటు కరకరలాడే పకోడీలు ఉంటే ఆ మజాయే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు పకోడీలను ఇష్టపడని వారెవరుంటారు?
సాధారణంగా మనం ఇంట్లో ఉల్లిపాయ, బంగాళదుంప, క్యాబేజీ లేదా పాలకూర పకోడీలు చేసుకుంటాం. కానీ ఎప్పుడైనా వంకాయ పకోడీ రుచి చూశారా? ముఖ్యంగా బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఈ వంకాయ పకోడీలు చాలా పాపులర్. అబ్బే వంకాయ నాకు అస్సలు ఇష్టం ఉండదు అని ముఖం చిట్లించే వారు సైతం ఈ కరకరలాడే వంకాయ పకోడీలను ఒకసారి రుచి చూస్తే, మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ తింటారు. సరైన కొలతలు, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే అద్భుతమైన రుచితో వీటిని తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
వంకాయ - 1
శనగపిండి - 1 కప్పు
వాము - అర టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
కారం పొడి - అర టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి, కొత్తిమీర
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
-ముందుగా వంకాయను శుభ్రంగా కడిగి, గుండ్రని బిళ్ళల్లా (మరీ మందంగా కాకుండా) కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో శనగపిండి వేయండి. అందులో వామును చేతులతో కొద్దిగా నలిపి వేయండి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. పకోడీలు కొద్దిగా ఘాటుగా కావాలనుకుంటే పచ్చిమిర్చి, కొత్తిమీర తురుమును కూడా జత చేయండి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా బజ్జీల పిండిలా కలుపుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయండి. నూనె బాగా కాగిన తర్వాత, వంకాయ ముక్కలను శనగపిండి మిశ్రమంలో బాగా ముంచి, నూనెలో నెమ్మదిగా వదలండి. మంటను మీడియంగా ఉంచి, పకోడీలు రెండు వైపులా బంగారు రంగులోకి మారి, కరకరలాడే వరకు వేయించండి.
-అంతే వేడివేడి వంకాయ పకోడీలు రెడీ. వీటిని పుదీనా చట్నీ లేదా తీపి చట్నీతో నంజుకుని, వేడివేడి టీతో ఆస్వాదిస్తే అద్భుతంగా ఉంటాయి.
పకోడీలు నూనె పీల్చకుండా, కరకరలాడేందుకు చిట్కాలు
-పకోడీలు వేయడానికి ముందు కలుపుకున్న శనగపిండిలో ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె, చిటికెడు వంటసోడా వేసి కలపండి. అలాగే కొద్దిగా బియ్యప్పిండి కలిపితే పకోడీలు మరింత కరకరలాడతాయి.
-కడాయిలో ఒకేసారి మరీ ఎక్కువ పకోడీలను వేయకండి. దీనివల్ల నూనె ఉష్ణోగ్రత తగ్గిపోయి, పకోడీలు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి.
-పకోడీలు వేయించిన వెంటనే అదనపు నూనెను పీల్చుకునేందుకు వాటిని టిష్యూ పేపర్ పై ఉంచండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
