Latest Updates
-
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు?
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు వరమహాలక్ష్మి దేవిని కలశ రూపంలో ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక ఆ రోజు ప్రసాదాల స్పెషల్స్ హడావుడి అంతా కాదు. మూడు రకాలు, ఐదు రకాలు, తొమ్మిది రకాలు ఇలా వీలైనంతలో నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి ఆశీస్సులు పొందుతారు. అయితే ప్రసాదాల తయారీ దగ్గర టైం చాలా పడుతుంది. ఈ క్రమంలో సింపుల్‌గా పదే నిమిషాల్లో సిద్ధమయ్యే రెసిపీని ఎంతో టేస్టీగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా చేసుకోవచ్చు. అదే జీరా ప్రసాదం..

తమిళనాడులోని ప్రసిద్ధ శ్రీరంగం ఆలయంలో జీరా ప్రసాదం చాలా ఫేమస్. నెయ్యి సువాసనతో సాఫ్ట్‌గా జీడిపప్పు పలుకులు తాగుతూ బెల్లం రుచితో ఎంతో కమ్మగా ఉండే ఈ ప్రసాదం రుచి చూస్తే ఆకులు సైతం నాకేస్తారు. అంత రుచిగా ఉంటుంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ స్పెషల్ అండ్ సింపుల్ ప్రసాదాన్ని తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే.. శ్రీరంగం టెంపుల్ స్టైల్ జీరా ప్రసాదం తయారీ విధానం చూద్దాం..
శ్రీరంగం టెంపుల్ స్టైల్ జీరా ప్రసాదం తయారీకి కావాల్సిన పదార్థాలు
సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ- కప్పు
నెయ్యి- ముప్పావు కప్పు లేదా కప్పు
జీడిపప్పు పలుకులు- రెండు టేబుల్ స్పూన్లు
నీళ్లు- రెండు కప్పులు
బెల్లం- రెండు కప్పులు
పటిక బెల్లం- అర కప్పు
ఏలకుల పొడి- అర టీస్పూన్
పచ్చ కర్పూరం- పావు టీస్పూన్
శ్రీరంగం టెంపుల్ స్టైల్ జీరా ప్రసాదం తయారీ విధానం
ముందుగా స్టవ్‌పైన వెడల్పాటి కడాయి పెట్టుకుని వేడయ్యాక అర కప్పు నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కాగనివ్వాలి.
బ్యాచ్‌లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.!
ఇందులో జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించాలి. తర్వాత కప్పు బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పైన మరో గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి. ఈ నీటిని వేయించిన రవ్వలో కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలిపి ఉడికించుకోవాలి.

రవ్వ ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసి కలపాలి. దంచి పొడిగా చేసిన పటిక బెల్లం కూడా వేసి రెండు కరిగేవరకు కలుపుకోవాలి.
తర్వాత మిగిలిన నెయ్యి కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా సాఫ్ట్‌గా కలుపుతూ ఉండాలి. ఏలకుల పొడి, పచ్చకర్పూరం వేసి మరోసారి కలపాలి.
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
అడుగంటకుండా మాటిమాటికీ కలుపుతూ నెయ్యి పైకి తేలేవరకు గరిటెతో కలియతిప్పాలి. నెయ్యి పైకి తేలుతూ మంచి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
ఈ నైవేద్యాన్ని అరిటాకులో వడ్డించి అమ్మవారికి వ్రతంలో సమర్పించండి. ఈ వరలక్ష్మీ వ్రతానికి చేసే ప్రసాదాల్లో ఈ రెసిపీ తప్పనిసరిగా ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
