Latest Updates
-
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026
ఆలూ కాలి మిర్చి క చోహ: మామ్స్ స్పెషల్ రిసిపి
ఆలూ కాలి మిర్చి క చోహా చాలా టేస్ట్ రిసిపి అంతే కాదు, చాలా సింపుల్ రిసిపి కూడా. ఎప్పుడైనా త్వరగా ఏదైనా వండాలి అనుకున్నప్పుడు, ఇది ఒక సింపుల్ రిసిపి.
ఈ సింపుల్ రిసిపి బ్రేక్ ఫాస్ట్ సైడ్ డిష్ లేదా మద్యహ్నాన భోజనం లేదా రాత్రి డిన్నర్లో తీసుకోవచ్చు. కాబట్టి, ఇంట్లో చాలా సింపుల్ గా టేస్టీగా తయారుచేసుకొని ఆలూ కాలి మిర్చి రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంప: 4
పెప్పర్ కారన్స్: 15
పచ్చిమిర్చి: 2(సన్నగా తరగాలి)
మెంతులు(మేతి): 1/2tsp
పసుపు: 1/2tsp
నెయ్యి: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: 1/2tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను ప్రెజర్ కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత కుక్కర్లో ఆవిరి పోయాక మూత తీసి, బంగాళదుంపల యొక్క పొట్టు తొలగించాలి. తర్వాత రఫ్ గా మ్యాష్ చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత అందులో మెంతులు వేసి, పెప్పర్ కార్న్ మరియు పచ్చిమిర్చి వేయాలి.
4. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకొన్న బంగాళదుంపలు అందులో వేసి ఫ్రై చేసుకోవాలి . రెండు నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
5. ఇప్పుడు రఫ్ గా పొడి చేసుకొన్న పెప్పర్ పౌడర్, ఉప్పు, పసుపును చిలకరించాలి .
6. మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ, 5నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. మరియు చివరగా కొద్దిగా పంచదార చిలకరించి, టేస్ట్ ను బ్యాలెన్స్ చేయాలి. అంతే టేస్టీ ఆలూ కాలీ మిర్చి క చోహ ను వేడి వేడి పూరీలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











