Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ - రాగి చీజ్ దోసె
రాగి దోసెను హెల్తీ ట్రీట్ గా పరిగణించవచ్చు. ఎందుకంటే దీన్ని రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చు. ఉదయం అల్పాహారానికి అతి త్వరగా తయారయ్యే రాగి చీజ్ దోసె చాలా సులభం. ఇది న్యూట్రీషియన్ మాత్రమే కాదు కొన్ని పదార్థాలు ఇందులో చేర్చడం వల్ల ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు, రుచికరమైనది కూడా. రాగి, చీజ్ దోసె మధుమేహ గ్రస్తులకు ఫేవరెట్ డిష్. మధుమేహంతో బాధపడే వారి ఈ రాగి చీజ్ దోసె రిసిపీని తప్పక ప్రయత్నించండి.
రాగి చీజ్ దోసె తయారు చేయడానికి సుమారు 10నిముషాలు పడుతుంది. రాగిపిండిని మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఎందకంటే ఇందులో అధికంగా ఫైబర్ ఉండి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది . కాబట్టి ఎక్కువ ఆకలిగా ఉన్నప్పుడు ఈ రాగి చీజ్ దోసె రెసిపినీ ప్రయత్నించండి..
రాగి పిండి: 1cup
సెమోలినా: 1cup
రైస్ పిండి: 1/2cup
మైదా పిండి: 1/2cup
మజ్జిగ: 1cup
నీరు: తగినన్ని
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిరపకాయలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
జీలకర్ర: 1tsp
కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పదార్థాలన్నింటిని వేయాలి.
2. తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి పిండిని కొంచెం జారుడుగా కలుపుకోవాలి.
3. తర్వాత దోసె పాన్ వేడి, అందులో దోసె పిండిని దోసెలా వేసి సర్కులర్ మోషన్ లో పిండిని తవా మొత్తం సర్ధాలి .
4. తర్వాత దోస అంచు చుట్టూ నూనె కొన్ని చల్లుకొని, మూత పెట్టాలి.
5. మూత పెట్టిన తర్వాత మీడియం మంట మీద 2-3నిముషాలు దోసె కాలనివ్వాలి.
6. తర్వాత మూత తీసి, దోసెను తీసి రెండవ వైపు కూడా కాల్చుకోవాలి.
7. చివరగా దోసె మీద చీజ్ ను గార్నిష్ చేయాలి. వేడి మీద చీజ్ రాయడం వల్ల చీజ్ కరిగి క్రీమిగా అద్భుతమైన టేస్ట్ ను అందిస్తుంది. ఈ రాగి చీజ్ దోసె తయారు చేయడం సులభం మరియు త్వరగా తయారవుతుంది కాబట్టి బ్రేక్ ఫాస్ట్ కు మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications












