Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
గోధుమ రవ్వ పొంగలి: వినాయక చవితి స్పెషల్
గోధుమ రవ్వతో తయారుచేసి పొంగలి నైవేద్యంగా దేవుడి సమర్పిస్తారు. మరి కొద్ది రోజుల్లో వినాయక చవితి రాబోతోంది. మరి వినాయకుడికి నైవేద్యంగా రవ్వపొంగలిని పెట్టవచ్చు. ఈ ట్రెడిషలన్ స్వీట్ పొంగల్ రిసిపిని తయారుచేయడానికి బెల్లం,పెసరపప్పు, రవ్వను ముఖ్య పదార్థాలుగా ఉపయోగిస్తారు.
చాలా సులభంగా, త్వరగా తయారుచేసే ఈ ట్రెడిషనల్ రిసిపి చాలా రుచిగా మరియు మంచి ఫ్లేవర్ తో ఘుమఘుమలాడుతుంటుంది. ఇందులో ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, బాదం తో మరింత టేస్ట్ గా ఉంటుంది. స్వీట్ ఇష్టం లేని వారు కొన్ని వెజిటేబుల్స్ బీన్స్, క్యారెట్, పీస్ వంటివి జోడించి వెజ్ పొంగల్ ను కూడా తయారుచేసుకోవాలి. మరి ఈ గోధుమ రవ్వ పొంగల్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
గోధుమ రవ్వ: 1/4kg
పెసరపప్పు: 100grm
బెల్లం: 100grm(పొడి చేసుకోవాలి)
యాలకులపొడి: 1tsp
నెయ్యి: 4tbsp
జీడిపప్పు: 10
బాదం: 4
తయారుచేయు విధానం:
1. ముందుగా పెసరపప్పును కడిగి నానబెట్టి తగినన్ని నీటితో మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మరొక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పును వేయించి పక్కన పెట్టి ఆ పాత్రలోనే మిగిలిన నేతిలో గోధుమ రవ్వను వేసి బంగారు రంగు వచ్చే వరకూ సన్న మంట మీద వేయించాలి.
3. రవ్వ వేగిన తర్వాత మూడు గ్లాసుల నీటిని పోసి ఉడికించాలి.
4. ఇప్పుడు ముందుగా ఉడికించిన పెసరపప్పు, బెల్లం పొడి, యాలకుల పొడి, జీడిపప్పు, బాదంతో అలంకరించాలి. అంతే గోధుమరవ్వ పొంగలి రెడీ.



Click it and Unblock the Notifications