Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కడై వెజ్: శ్రావణ మాసం స్పెషల్
ఎప్పటిలాగే అవే వంటలు ... అవే రుచులు...పాత్రలు వేరు... రూపం వేరు..అనుకుంటున్నారా! కాదు కాదు... కానే కాదు. మీ మనసుకి నచ్చే కడై వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. కడై వంటల్లో వివిధ రకాలున్నాయి. వాటిలో కడై చోలే, కడై దాల్ తడ్కా, కడై పనీర్, మష్రూమ్ మసాలా, పాలక్ కార్న్, కడై వెజ్ మొదలగునవి. వేటికవే ప్రత్యేక రుచి కలిగి ఉంటాయి.
వండటం కూడా చాలా సులభం. కడై వంటలను శ్రావణ మాసంలో ఎక్కువగా తయారుచేసుకుంటారు. శ్రావణ మాసంలో తయారుచేసుకొనే వంటల్లో ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి చేర్చకుండా వండుతారు. ఈ రోజు మీకోసం కడై వెజ్ ను పరిచయం చేయడం జరిగింది. అయితే ఈ వంటకు ఉల్లిపాయ, వెల్లుల్లిని చేర్చడం జరిగింది. మంచి ఫ్లేవర్ తో పాటు మంచి రుచి కలిగి ఉండటానికి అల్లం వెల్లుల్లి జతచేయడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం కడైవెజ్ ను వండండికడైలోకి చేర్చండి... అందంగా అలంకరించండి అతిథులను ఆహ్వానించండి... ఆప్యాయంగా వడ్డించండి.

కావలసిన పదార్థాలు:
బీన్స్ తరుగు : 20 grm
క్యారట్ తరుగు: 20 grm
క్యాలీఫ్లవర్ తరుగు: 20 grm
బఠాణీ: 20 grm.
బంగాళదుంప ముక్కలు: అర కప్పు
(వీటిని కొద్ది నూనెలో వేయించి పక్కన ఉంచుకోవాలి)
పనీర్ ముక్కలు: 100 grm.
క్యాప్సికమ్ ముక్కలు: 40 grm.
ఉల్లిపాయ: 30 grm(పెద్ద ముక్కలుగా తరగాలి)
ఉల్లితరుగు: 20 grm.
టొమాటో తరుగు: 40 grm
పసుపు: చిటికెడు
కారం: 20 grm
కొత్తిమీర తరుగు: కొద్దిగా
పచ్చిమిర్చి: 5
మిరియాలపొడి: 5 grm
గరంమసాలా: 5 grm
ఉప్పు: తగినంత
నల్ల ఉప్పు: కొద్దిగా,
అల్లంవెల్లుల్లి పేస్ట్: టీ స్పూను,
షాజీరా: 3 grm.
డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం
పల్లీలు: 10 grm జీడిపప్పు: 4:5 పలుకులు
కర్బూజా గింజలు: 10 grm బాదంపప్పు: 10 grm.
నూనె: 5grm
(వీటిని వేయించి, చల్లారాక కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి)
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి కాగాక షాజీరా, ఎండుమిర్చి, ఉల్లితరుగు వేసి వేయించాలి.
2. తర్వాత అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, టొమాటో ముక్కలు, మిగిలిన పదార్థాలను వేసి నూనె పైకి తేలే వరకు మీడియం మంట మీద వేయించాలి.
3. తర్వాత పెద్దగా తరిగిన ఉల్లితరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి ఉడికించాలి.
4. ఇప్పుడు అందులోనే కూరగాయ ముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని మెత్తబడే వరకూ ఉడికించాలి.
5. కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే కడై వెజ్ రెడీ



Click it and Unblock the Notifications











