Latest Updates
-
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి!
మలై పన్నీర్ -చాలా సింపుల్ అండే టేస్టీ
మలై పన్నీర్ రిసిపి చాలా సులభం. చాలా సులభం అయితే టేస్ట్ మాత్రం అమోఘం. ఈ వంటకాన్ని ఏ టైమ్ లో చేసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్, మీల్, డిన్నర్ అన్నింటికి బాగా నప్పుతుంది. సైడ్ డిష్ గా మరింత రుచిగా ఉంటుంది.
పన్నీర్ తో అనేక రకాల వంటలు వండుతారు. అయితే కొంచెం డిఫరెంట్ గా కొత్త రుచి కోరుకొనే వారు మలై పన్నీర్ రిసిపిని ట్రై చేయవచ్చు. ఇది పిల్లలకు.. పెద్దలకు అందరికీ, యంగ్ స్టర్స్ కు అందరికీ నచ్చుతుంది. మరి ఈ రోజు పన్నీర్ రిసిపి ట్రై చేయండి.....

కావలసిన పదార్థాలు
పన్నీర్ ముక్కలు: 1/2kg
ఉల్లిపాయలు: 2
టమోటో: 2
గరం మసాలా: 1tsp
అల్లం,వెల్లుల్లి పేస్ట్ : 2tsp
కారం : 1tbsp
ధనియాల పొడి : 1tbsp
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత
మీగడ: 1/2cup
నూనె: 1/4cup
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేయాలి. నూనె వేడయ్యాక తురిమిన ఉల్లిపాయల్ని వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి.
2. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి ముద్ద కారం, ధనియాల పొడి, పసుపు, టమోటో ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాలపాటు వేయించాలి.
3. తరువాత పన్నీర్‌ముక్కలు వేసి మసాలా వాటికి బాగా పట్టే వరకు వేగించాలి. చివరగా మీగడ వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
5. చివరగా గరం మసాలా వేడి కలియబెట్టి, మరో రెండు నిముషాల ఉడికంచి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడిగా వడ్డించాలి. అంతే మలైపన్నీర్ రెడీ. ఇది చపాతీలోకి, పలావ్‌లోకి చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications











