Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
మసాలా ఎగ్-దోసె

కావలసిన పదార్థాలు:
దోసెల పిండి: 1/2kg
ఉల్లిపాయ: 2
ఉడకబెట్టిన గుడ్లు: 4
వెల్లుల్లి రెబ్బలు: 6-8
అల్లం ముక్క: చిన్నది
ధనియాలపొడి: 1/2kg
పచ్చిమిర్చి: 2
పసుపు: చిటికెడు
టమాటో గుజ్జు: కొద్దిగా
గరం మసాలా పొడి: 2tbsp
క్యారెట్, బీన్స్ ముక్కలు(సన్నగా తరిగినవి): 1/2cup
నెయ్యి లేక నూనె: తగినంత
కొత్తమీర తురుము: కొద్దిగా
ఉడకబెట్టిన పచ్చిబఠాణీ: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
మసాలా తయారు చేయు విధానం
1. ఉడకబెట్టిన గుడ్డుపై పెంకు తీసి, మీడింసైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయ ముక్కలుగా చేసుకుని, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 3. పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో మసాలా ముద్దను వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. దీనికి మిగతా మసాలా పదార్థాలు కూడా కలిపి మరికొద్దిసేపు వేగనివ్వాలి.
4. తర్వాత టొమాటో గుజ్జు వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు, పచ్చిబఠాణీలు, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న గుడ్లు కూడా వేసి కప్పు నీరు పోసి బాగా ఉడికించుకోవాలి.
దించే ముందు కొత్తిమీర తురుము గార్నిష్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇక దోసె వేసే విధానం: పాన్ మీద తక్కువ నూనె వేసి దోశను పలుచగా పోసి దోరగా కాల్చుకోవాలి.
6. ఇప్పుడు దీనిపైన రెడీ చేసుకున్న ఎగ్ మసాలా కూర పలుచగా పరిచి, మధ్యకి మడచి కిందకు దింపేసుకోవాలి. దీనికి కొబ్బరి చట్నీ, సాంబారు మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications











