Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
మస్కుల్ : రైస్ విత్ ఆనియన్ రిసిపి: రంజాన్ స్పెషల్
రంజాన్ నెల ప్రారంభం కాబోతున్నది. రంజాన్ పీరియడ్ లో ముస్లీలందరూ పవిత్రంగా ఉపవాస దీక్షలు చేస్తారు. తర్వాత సాయంత్ర ఉపవాసదీక్ష విరమిస్తారు. ఇలా ప్రతి రోజూ ఒక నెలపాటు కొనసాగిస్తారు. ఇలా ఉపవాసం ఉన్నవారికోసం కొన్ని త్వరగా సింపుల్ గా, ఈజీగా తయారయ్యే వంటల గురించి మన వెంటనే తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైన మస్కుల్ రిసిపి గురించి విన్నారా?ఇది నిజానికి ఇండియన్ రిసిపి కాదు, అయినా, మన ఇండియన్ స్టైల్లో ఈ వంటను తయారుచేసుకోవచ్చు.
మస్కుల్ రిసిపి సౌదీ అరేబియాన్ రిసిపి. బేసిక్ గా ఉల్లిపాయలతో కలిపి రైస్ ను వండుతారు . ప్లెయిన్ రైస్ కు బదులుగా ఈ మస్కుల్ రైస్ ను ఎక్కువగా వండుకుంటారు. మరి ఈ వెరైటీ డిష్ ను మీ ఇఫ్తార్ టేబుల్ మీద కలర్ ఫుల్ గా అరేంజ్ చేసి, టేస్ట్ ను ఎంజాయ్ చేయండి.
కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups
ఉల్లిపాయలు: 2
నెయ్యి: 1/2cup
నీళ్ళు: 3cups
కుంకుమ పువ్వు: కొద్దిగా
రోజ్ వాటర్: 3cups
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి బాగా మరిగించాలి. నీరు మరిగేటప్పుడు అందులో బాస్మతి బియ్యం కడిగి వేయాలి.
2. తర్వాత మూత పెట్టి 10నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
3. అంతలోపు ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి .
4. ఇప్పడు బేకింగ్ డిష్ కు కొద్దిగా నెయ్యి రాసి, వేయించి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు సగం వేసి బేకింగ్ డిష్ మొత్తం సర్ధాలి.
5. తర్వాత అన్నం సగం ఉడికిన తర్వాత అదనపు గంజి వంపి, అన్నంను ఉల్లిపాయల మీద సర్ధాలి.
6. అన్నం మీద కొద్దిగా రోజ్ వాటర్ మరియు కుంకుమ పువ్వును చిలకరించాలి.
7. తర్వాత అన్నం మీద మరో లేయర్ ఫ్రై చేసి ఉల్లిపాయలు వేసి సర్ధాలి తిరిగి అన్నం, అరకప్పు నీళ్ళ వేసి మూత పెట్టాలి.
8. చాలా తక్కువ మంట మీద 10నిముషాల పాటు ఉడికించుకోవాలి. అంతే మస్కుల్ రైస్ విత్ ఆనియన్ రిసిపి రెడీ. ఈ రుచికరమైన మస్కుల్ రైస్ ను చికెన్ కర్రీ లేదా కబాబ్స్ తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











