మీల్ మేకర్‌ వెజిటబుల్ బిర్యాని

Meal Maker Vegetable Biryani
కావలసిన పదార్థాలు:
బాసుమతి బియ్యం: 3cup
మీల్ మేకర్: 1cup (వేడి నీటిలో పావుగంట నానబెట్టిన)
మిక్స్‌డ్ వెజిటబుల్ తరుగు (బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్, ఆలు):1cup
నెయ్యి: 2 tbsp
ఉల్లిపాయ తరుగు:1cup
అల్లం తరుగు: 1tbsp
పచ్చిమిర్చి: 4
షాజీరా: 1 tsp
బిరింజాకు: 4
ఉప్పు: రుచికి సరిపడా
పుదీనా తరుగు: 1cup
కొబ్బరి పాలు: 2cups
జీడిపప్పు: 10
యాలకులు: 5
దాల్చినచెక్క: 1 అంగుళం
లవంగాలు: 6
నీరు: 5cups

తయారుచేసే విధానం:
1. నెయ్యిలో షాజీరా, బిరింజాకు, జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేగాక తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం తరుగు, పుదీనా, మిక్స్‌ డ్ వెజిటబుల్స్ వేగించాలి.
2. ఇప్పుడు మీల్‌ మేకర్ వేసి రెండు నిమిషాలయ్యాక కొబ్బరి పాలు పోయాలి.
3. తర్వాత నీరు కలపాలి. మరుగుతున్నప్పుడు బియ్యం, ఉప్పు వేయాలి. నీరంతా తగ్గిపోయాక మూతపెట్టి సన్నని మంటపై మగ్గించాలి. అంతే మీల్ మేకర్ వెజిటబుల్ బిర్యాని రెడీ. పెరుగు రైతాతో ఈ బిర్యాని చాలా బాగుంటుంది.

Story first published: Monday, November 29, 2010, 14:40 [IST]
Desktop Bottom Promotion