కూరగాయల పులగం

By Staff

Mixed Veg Curry
క్యారెట్‌: పావుకిలో, బీన్స్‌: పావుకిలో, బంగాళాదుంపలు: అరకిలో, క్యాప్సికమ్‌: పావుకిలో, కాలీఫ్లవర్‌: ఒకటి, ఉల్లిపాయలు: పావుకిలో, అల్లంవెల్లుల్లి: 4 టీస్పూన్లు, పచ్చిమిర్చి: 6, కారం: 4 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, పెరుగు: అరకిలో, గరంమసాలా: 5గ్రా., పచ్చికొబ్బరి: ఒక కాయ, గసాలు: 50గ్రా., నూనె: 150గ్రా., ఉప్పు: 50గ్రా. లేదా సరిపడినంత

వండే విధానం: కూరగాయలను శుభ్రంచేసి కావలసిన సైజులో ముక్కలుగా తరిగి ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టుకోండి.
* ఓ గిన్నెలో నూనె వేసి ఉల్లిముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి, కారం, పసుపు వేసి వేయించి నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పెరుగు వేసి ఓ చిన్న స్టీలు డబ్బాలో పెట్టుకోవాలి.
* పచ్చికొబ్బరి, గసాలూ కలిపి మెత్తగా రుబ్బాలి. అందులో 50గ్రా. ఉప్పు కలిపి కొత్తిమీర కూడా చేర్చి ప్యాక్‌ చేసుకోవాలి.

* అనుకున్న చోటుకి వెళ్లాక పొయ్యి వెలిగించి 5 లీటర్ల సైజు గిన్నె పెట్టి రెండున్నర లీటర్ల నీళ్లు పోసి కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ మసాలా మిశ్రమం వేసి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తరవాత కొబ్బరి మసాలా కూడా వేసి మరో పది నిమిషాలు ఉడికించి దించాలి.

Story first published: Monday, November 17, 2008, 6:30 [IST]
Desktop Bottom Promotion