Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
పనీర్ ఫ్రైడ్ రైస్

పనీర్ - 2 cup
బాస్మతి బియ్యం - 2 cup
క్యాప్సికమ్ - 1 (చిన్నగా తరిగినవి)
పచ్చిబఠాణి - 1/2 cup
జీడిపప్పు 25 gms
తాజా కొబ్బరి తురుము - 1/4 cup
క్యారట్ తురుము - 1/4 cup
ఉల్లికాడల తురుము - 1/4 cup
చిల్లీ సాస్ - 1 tsp
టొమాటో సాస్ - 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద - 1tsp
గరం మసాలా పొడి - 1/2 tsp
మిరియాలపొడి - 1/2 tsp
ఉప్పు - రుచికి సరిపడా
అజినోమాటో - చిటికెడు
నూనె 50 gms
తయారు చేయు విధానము:
1. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అంగుళం ముక్కలుగా కోసిన పనీర్ ముక్కలు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. బియ్యం కడిగి కాస్త బిరుసుగా(పొడిపొడిగా) వండి పెట్టుకోవాలి.
3. అదే పాన్ లో మరి కొద్ది నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లిముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఉల్లికాడల తురుము, క్యాప్సికమ్, పచ్చిబఠానీలు, క్యారట్ తురుము వేసి కలిపి కొద్దిగా వేయించాలి.
4. ఆ తర్వాత చిల్లీసాస్, టోమాటో సాస్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా వేపాలి.
5. ఇప్పుడు అందులోనే వేపి పెట్టుకొన్న పనీర్, జీడిపప్పు ముక్కలు, అజినోమాటో, వండిన అన్నం వేసి అన్నీ బాగా కలియబెట్టాలి. చివరగా తురిమిన కొత్తిమిర, కొబ్బరి కూడా చల్లి 5 నిమిషాలు ఉంచి దింపేయాలి. అంతే ఫన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.



Click it and Unblock the Notifications











