పనీర్ క్యాప్సికమ్ భుర్జ్ టేస్టీ అండ్ హెల్తీ

కాటేజ్ చీజ్ లేదా పనీర్ కాంబినేషన్ డిష్ చాలా టేస్ట్ గా ఉంటుంది. మరియు చాలా సింపుల్ రిసిపి. చాలా త్వరగా తయారుచేసేయవచ్చు. నార్త్ ఇండియన్స్ ఈ వంటను ఎక్కువగా తయారుచేసుకుంటారు.

మన సౌత్ లో ఇలాంటి వంటలు చాలా తక్కువగా తయారుచేసుకుంటారు. ఇది చాలా సింపుల్ గా తయారుచేసేయవచ్చు. ఇది మంచి టేస్ట్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతే కాదు, ఈ సీజ్ లో మనకు అందుబాటులో లఉండే ఈ రెండింటి కాంబినేషన్ తో ఒక రుచికరమైన హెల్తీ డిష్ ను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం...

Quick & Easy Paneer Capsicum Bhurji Recipe
కావల్సిన పదార్థాలు:
పన్నీర్: 200 gms(పొడి చేసుకోవాలి లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యాప్సికమ్: 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
టమోటోలు: 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tsp
పచ్చిమిర్చి: 2 (మద్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి)
జీలకర్ర పొడి: 1tsp
పసుపు: 1/2 tsp
కారం: 1tsp
ఛాట్ మసాలా: 1tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు:రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2-3tbsp (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నూనె: 2tbsp

Quick & Easy Paneer Capsicum Bhurji Recipe
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ లోకి సాఫ్ట్ గా వేగే వరకూ వేగించుకోవాలి.

Quick & Easy Paneer Capsicum Bhurji Recipe
3. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ , పచ్చిమిర్చి, పసుపు, కారం, జీలకర్ర వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో టమోటోలు మరియు ఉప్పు వేసి వేగించుకోవాలి.

Quick & Easy Paneer Capsicum Bhurji Recipe
5. టమోటో మెత్తగా వేగిన తర్వాత అందులో ఛాట్ మసాలా మరియు పనీర్ వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి . ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
5. 5నిముషాలు ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర కూడ వేసి గార్నిషింగ్ గా ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే పన్నీర్ క్యాప్సికమ్ బుర్జ్ రెడీ. ఈ రుచికరమైన వంటను పరోటాలు మరియు రోటీలతో సర్వ్ చేయాలి.
Quick & Easy Paneer Capsicum Bhurji Recipe

Story first published: Thursday, January 22, 2015, 12:36 [IST]
Desktop Bottom Promotion