సొరకాయ వేపుడు

Sorakaya Vepudu
కావలసిన పదార్థాలు:
సొరకాయముక్కలు: 2cups
శనగపిండి: 1cup
జీలకర్ర: 1tsp
వాము: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
వేరుశనగపప్పు: 1/2cup
పచ్చిమిర్చి: 4
కారం: 1tsp
కరివేపాకు: 2రెమ్మలు
కొత్తిమీర: 4రెమ్మలు
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానము:
1. సొరకాయ ముక్కల్లో శనగపిండి, జీలకర్ర, వాము, ఉప్పు వేసి అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించి పకోడీల పిండిలా కలుపుకోవాలి.
2. పాన్ లో నూనె వేసి కాగాక మిశ్రమాన్ని పలుకులుగా పడేటట్లు వేసి దోరగా కాలాక తీసి పక్కన ఉంచాలి.(ఒక్కొక్క సొరకాయ ముక్క విడిగా పడేటట్లు వేసుకుంటే సమంగా కాలి వేపుడు రుచిగా ఉంటుంది).
3. పాన్ లో కొద్దిగా నూనె అలాగే ఉంచి మిగిలినది గిన్నెలోకి తీసేయాలి. అందులో వేరుశనగపప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత ముందుగా వేయించి పక్కన ఉంచిన సొరకాయ పకోడీలు వేసి కలపాలి. అంతే చివరగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరి సొరకాయ వేపుడు రెడీ.

Story first published: Wednesday, January 5, 2011, 16:26 [IST]
Desktop Bottom Promotion