Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
పుదీనా-బేబి పొటాటో కర్రీ

కావలసిన పదార్థాలు:
బేబి పొటాటో(చిన్న బంగాళాదుంపలు): 1/2kg
గట్టిపెరుగు: 2cups
జీడిపప్పు: 12-15
జీలకర్ర పొడి: 1tsp
చాట్ మసాలా: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3tbsp
వెన్న: 1cup
పసుపు: 1/4tsp
పుదీనా ఆకులు: 1cup
ధనియాల పొడి: 1tbsp
పచ్చిమిర్చి: 4-6
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కావలసినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను శుభ్రం చేసి, గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి అందులో బంగాళదుంపలు వేసి స్టౌ మీద మీడియం మంట మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. కొద్దిసేపటి తర్వాత చల్లారాక పై తోలు తీసి, పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉడికించిన పొటాటోను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అరకప్పు పుదీనా పేస్ట్, జీడిపప్పు పేస్ట్, వేసి దోరగా వేయించుకోవాలి.
4. తర్వాత అందులోనే పెరుగు కూడా వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. కావాలనుకుంటే కొద్దిగా నీరు పోసుకోవచ్చు.
5. దీనిలో మిగిలిన అన్ని మసాలాలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మరికొద్దిసేపు ఉడికించాలి.
6. ఇప్పుడు బేబి పొటాటో(బంగాళాదుంపలు) వేసి సన్నని సెగన ఉడికించాలి. ముక్కలకి గ్రేవీ పట్టేంత వరకూ పొయ్యి మీద వుంచాలి. దించే ముందు పుదీనా ఆకులు లేదా పొడి చల్లి దించేయాలి. ఇది చపాతీల్లోకి లేదా వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది.
ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానమైన ఆహార పదార్ధం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్ధం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఈ స్టార్చిలో కొద్ది భాగం పొట్టలోను, చిన్న ప్రేవులలోను స్రవించే ఎంజైములు వలన జీర్ణం కాదు. కనుక ఈ జీర్ణం కాని స్టార్చి భాగం పెద్ద ప్రేవులోకి తిన్నగా వెళ్ళిపోతుంది. ఈ జీర్ణం కాని స్టార్చి (resistant starch) వలన శరీరానికి ఆహార పీచు పదార్ధాలు (Dietary fiber) వల్ల కలిగే ఉపయోగాలవంటి ప్రయోజనాలే కలుగుతాయని భావిస్తున్నారు
శరీర పౌష్టికత,
కోలన్ క్యాన్సర్ నుండి భద్రత,
గ్లూకోజ్ ఆధిక్యతను తట్టుకొనే శక్తి,
కొలెస్టరాల్ తగ్గింపు,
ట్రైగ్లిజరైడులు తగ్గింపు వంటివి.
దుంపను ఉడకపెట్టి ఆరబెడితే ఇలా జీర్ణంకాని స్టార్చి ఎక్కువవుతుంది. ఉడికిన వేడి దుంపలో ఉండే 7% జీర్ణంకాని స్టార్చి, దానిని ఆరబెట్టినపుడు 13%కు పెరుగుతుంది.



Click it and Unblock the Notifications











