Latest Updates
-
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా?
స్వీట్ కార్న్- మెంతి పులావ్

మెంతికూరతో స్వీట్ కార్న్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు స్వీట్ కార్న్ లో ఉన్నాయి. విటమిన్ బి1, బి5, సి, ఫోలేట్, ఫాస్పరస్, పీచు పదార్థం,
మాంగనీస్, ఖనిజలవణాలు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఆహారంలో వీటిని తరచూ తీసుకోవడం వల్ల కాలేయం సమస్యలను దరిచేరనివ్వదు. రకరకాల కాంబినేషన్స్ తో చేసే రైస్ ఐటమ్స్ ఎప్పుడూ నచ్చుతాయి. ఆకుపచ్చని మెంతికూర, స్వీట్ కార్న్ కలిపి చేసే ఈ పులావ్ కూడా ఈజీగా చేసెయ్యొచ్చు.పెరుగు చట్నీ దీనిలోకి బావుంటుంది.
కావలసిన పదార్థాలు:
స్వీట్ కార్న్ : 1cup
బాస్మతి రైస్ : 2cups
మెంతి కూర : 3కట్టలు
టమాటాలు : 2
ఉల్లిపాయ : 1
పచ్చిమిర్చి :4-8
కొత్తిమీర : ఒక కట్ట
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tsp
గరంమసాలా పొడి: 1tsp
ఉప్పు,కారం,పసుపు,నూనె: సరిపడా
లవంగాలు-4,చెక్క:చిన్న ముక్క,షాజీర, యాలకలు
తయారు చేసే విధానం:
1. ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడిచేసి అందులో చెక్క, లవంగాలు,యాలకులు, షాజీర వేసి వేగనివ్వాలి.
3. ఇప్పుడు మద్యలోనిక తరిగిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
4. తర్వాత అందులోనే టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు మెత్తగా ఉడికిన తరువాత పసుపు,కారం,ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి, తరిగి పెట్టుకొన్న తికూర, స్వీట్
కార్న్, ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా పొడి వేసి కలపాలి.
5. రెండు మూడు నిముషాలు వేయించి తగినన్ని నీళ్ళు, ఉప్పు వేయాలి. నీరు మరిగినప్పుడు బియ్యం వేసి కలిపి మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చాక స్టౌఆఫ్ చెయ్యాలి.
6. కుక్కర్ లో ఆవిరి పోయిన తరువాత తీసి, మూత తీసి ఒకసారి కలిపి వేడిగా సర్వ్ చెయ్యాలి. వేడివేడిగా ఏదైనా రైతాతో తింటే బావుంటుంది. ఇందులో స్వీట్ కార్న్ బదులు మామూలు కార్న్ అయినా వాడొచ్చు.



Click it and Unblock the Notifications











