Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
ట్యాంగీ మసాలా ఆలూ: బెస్ట్ రోటీ కాంబినేషన్
బంగాళదుంప అన్నిఏజ్ గ్రూపుల వారికి చాలా ఇష్టమైన ఆహార పదార్థం. మరియు ఇది చాలా సింపుల్ గా మరియు సులభంగా తయారుచేసేటటు వంటి వెజిటేరియన్ రిసిపి. మీరు చాలా త్వరగా వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా సింపుల్ వంటను తయారుచేసుకోవాలనుకొన్నప్పుడు ఈ వెజిటేరియన్ వంట చాలా సులభం. అయితే ఒక రకమైన పొటాటో వంట తిని బోరుకొడుతుంటే ఒక కొత్త రకం వంటను ప్రయత్నించండి.
ఎప్పుడూ మసాలా ఉపయోగించి తయారుచేసే ఆలూ, కాస్త వెరైటీగా కొంచెం పుల్లగా వెరైటీ టేస్ట్ తో తయారుచేసుకుంటా రోటీలకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలూ రిసిపికి ఎక్కువ మసాలాలు ఉపయోగించే అవసరం లేదు. ఇంట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు మాత్రమే ఉపయోగించి తయారుచేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ ట్యాంగీ మసాలా ఆలూ టేస్ట్ చేయాలంటే, తయారుచేయడం నేర్చుకోవాల్సింది...

కావల్సిన పదార్థాలు:
బంగాళ దుంపలు: 4 (ఉడికించిన మరియు పొట్టు తీసినవి)
ధనియాలు: 1tbsp(పొడిచేసుకోవాలి)
జీలకర్ర పొడి: 1tsp
ఎండు మిర్చి: 2tsp
చాట్ మసాలా: 2tsp
బ్లాక్ సాల్ట్ :¼ tsp
హింగ్ (ఇంగువ): చిటికెడు
జీలకర్ర: 1tsp
పంచదార: ½ tsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: 1tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా ఉడికించిన బంగాళదుంపలను మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసి పక్కన పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో జీలకర్ర, ఇంగువ వేసి ఒక నిముషం పాటు వేయించుకోవాలి.
3. తర్వాత అందులో ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు వేసి, మూడు నాలుగు నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
4. తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండు మిర్చి, ఛాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, షుగర్ వేసి మరో 3,4 నిముషాలు వేయించుకోవాలి.
5. 5నిముషాలు వేగించుకొన్న తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసి, స్పైసీ ట్యాంగీ మసాలా ఆలూ సర్వ్ చేయండి. ఈ రోటీలతో సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications











