Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
కమ్మని క్యాబేజి ఫ్రై

క్యాబేజి: 2cups(చిన్న ముక్కలుగా తరిగినవి)
ఉల్లిపాయ: 1 లేదా 2(చిన్న ముక్కలుగా తరిగినవి)
వెల్లుల్లిపాయలు: 4-6రెబ్బలు(చిన్నగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2
ఎండు మిర్చి: 2
జీలర్ర: 1tsp
శెనగపప్పు, ఉద్దిపప్పు: 1tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి కొద్దిగా వేడి అయ్యాక, కడిగి పెట్టుకొన్న క్యాబేజిని అందులో వేసి, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఆవిరిలోనే పదినిమిషాల పాటు ఉడకనివ్వాలి. కావలనుకొంటి కొద్దిగా నీళ్ళను చిలకరించుకోవచ్చు.
2. తర్వాత ఉడికిన క్యాబేజిని ఒక బౌల్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి తర్వాత ఆవాలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
4. తర్వాత అందులోనే ఉద్దిపప్పు, శెనగపప్పు వేసి మరో నిమిషం వేయించి, వెంటనే ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించాలి.
5. ఉల్లిపాయ ముక్కలు సగ భాగం ఉడికిందనిపించగానే టమోటో ముక్కలు కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి, టమోటో బాగా మెత్త బడే వరకూ ఉడికించాలి.
6. చివరగా ముందే ఉడికించే పెట్టుకొన్న క్యాబేజిని పోపు మిశ్రమంలో వేసి, తక్కువ మంట మీద మరో ఐదు నిమిషాలు పాటు వేయించుకోవాలి. అంతే క్యాబేజి ఫ్రై రెడీ. ఇది అన్నంలోకి మంచి కాంబినేషన్. అలాగే సైడ్ డిష్ గా కూడా సర్వ్ చేసుకోచ్చు.



Click it and Unblock the Notifications











