Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
స్వీట్ కార్న్(మొక్కజొన్న) రైస్

కావలసిన పదార్దములు :
మొక్కజోన్నగింజలు (స్వీట్ కార్న్) : 2cups
క్యారెట్: 1/4cup(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిబఠాని: 1/2cup
ఉల్లిపాయ: 1((చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
పచ్చిమిర్చి: 4-6
నూనె: వేయించడానికి సరిపడా
జీలకర్ర: 1tsp
పంచదార: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
బాస్మతి బియ్యం : 3cups(ఉడికించిన అన్నం)
జీడిపప్పు: 3tbsp
కిస్ మిస్: 2tbsp
కొబ్బరిపాలు : 3cups
తయారు చేయు విధానం :
1. బియ్యం కడిగి కొబ్బరి పాలలో అరగంట నానబెట్టాలి. తర్వాత కొబ్బరి పాలతో సహా బియ్యం వేసి అవసరమనుకుంటే కొద్దిగా నీళ్ళు కలిపి మూతపెట్టి పది నిముషాలు వుడకనివ్వాలి. ఇప్పుడు మూతతీసి ఉప్పు వేసి కలిపి, అన్నం ఉడికేంతవరకు వుంచి స్టౌ కట్టేయాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడాక, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
3. తర్వాత అందులో పంచదార వేసి కరగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు తక్కువ మంటలో వేయించుకోవాలి.
4. తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, పచ్చిబఠానీ, స్వీట్ కార్న్(మొక్కజొన్న గింజలు) ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించి కొద్దిసేపు మూత పెట్టి, ఆవిరి మీద ఉడికించుకోవాలి.
5. తర్వాత మూత తీసి వెజిటేబుల్స్ ఉడికాయో లేదా చూసుకొని తర్వాత ఉడికించిన అన్నం అందులో కలుపుకొని బాగా మిక్స్ చేయాలి.
6. చివరగా వేయించుకొన్న జీడపప్పు, కిస్ మిస్ ను గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే స్వీట్ కార్న్ రైస్ రెడీ....



Click it and Unblock the Notifications











